ఆధ్యాత్మికం

పూజలు, నోములు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఎంతో ఆచరణలో ఉంది. ఉల్లికి అంత ప్రాధాన్యత కల్పించే మనము, ఏదైనా పూజలు, నోములు చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదని చెబుతుంటారు. ఎంతో ఆరోగ్యకరమైన ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే దానికి సరైన జవాబు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పూజల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం తీసుకునే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు. అవి సాత్వికం, తామసి కం, రాజసికం. ఈ మూడు రకాల ఆహారాన్ని బట్టి మనుషులలో గుణాలను పెంచటం, తగ్గించటమో చేస్తుంది. ఇందులో ఉల్లి, వెల్లుల్లి, మసాలా రాజసికం కిందకు వస్తాయి.ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల సరైన ఆలోచనలు ఏకాగ్రత లేకపోవడం, తరుచూ కోపం వస్తాయి.

why onion and garlic is not eaten when doing pooja

పూజ చేసే సమయంలో ఏకాగ్రత ఎంతో అవసరం కనుక పూజ చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి అశుభ్రమైన ప్రదేశాలలో పెరగటం వల్ల ఎంతో నిష్ఠతో చేసే పూజ సమయంలో వీటిని తినకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts