information

భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఎక్కువగా నీలి రంగులోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా ?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా గుర్తింపు పొందింది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది అనేక రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. కొన్ని ప్యాసింజర్‌ రైళ్లు కాగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఇంకొన్ని సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఉన్నాయి. అయితే చాలా వరకు రైళ్లకు బ్లూ కలర్‌ వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు.. అంటే 1990కి ముందు రైళ్లలో అడ్వాన్స్‌డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అప్పట్లో వాక్యూమ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉండేది. అయితే అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాక దానికి, వాక్యూమ్‌ సిస్టమ్‌కు మధ్య తేడా కనిపెట్టలేకపోయారు. అంటే.. ఏ రైలులో ఏ వ్యవస్థ ఉందో తెలియకపోయేది. ఈ సమస్యను అధిగమించేందుకు అప్పట్లో వాక్యూమ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉన్న రైళ్లకు రెడ్‌ కలర్‌ వేసే వారు. అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉన్న రైళ్లకు నీలి రంగు వేసేవారు.

why some of the indian trains in blue color

అయితే ఇప్పుడు వాక్యూమ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లేదు. కానీ రాజధాని, శతాబ్ది వంటి కొన్ని రకాల ప్రత్యేక రైళ్లు మాత్రం భిన్న రంగుల్లోనే ఉంటున్నాయి. అయితే ఇప్పటికీ మనం అనేక రకాల రైళ్లు నీలి రంగులోనే ఉండడం గమనించవచ్చు.

Admin

Recent Posts