ఆధ్యాత్మికం

Venkateswara Swamy : 8 శనివారాలు ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.. అనుకున్న పనులు అన్నీ పూర్తి అయిపోతాయి కూడా..!

Venkateswara Swamy : చాలామంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకించి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం జరుగుతుంది. శనివారం అంటే, మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎటువంటి ఆపద కలిగినా, ఆదుకోమని మనం వెంకటేశ్వర స్వామిని అడుగుతుంటాము. చాలామంది, శనిదేవుడు ప్రభావం వలన అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే, వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయాలి.

వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయడం వలన, శని బాధల నుండి బయటపడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి కృప, మన మీద ఉంటుంది. అలానే, ఏ దోషాలు కూడా ఉండవు. ఏడుకొండల వాడి దయతో పాటు, శని దోషం కూడా పోవాలి అంటే, ఇలా శనివారాలు చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది, ఇలా చేయడం వలన ఏడుకొండలు వాడి దయ ఉంటుంది. అనుకున్నవి నెరవేరుతాయి. పైగా శని దోషం కూడా పోతుంది.

do like this for 8 saturdays to remove all doshams

ఒకవేళ కనుక ఆడవాళ్లు. ఈ శనివారాలు చేసినట్లయితే, ఏమైనా అడ్డంకులు వస్తే అక్కడ నుండి లెక్క వేసుకుని మళ్లీ చేయొచ్చు. మొదటి నుండి చేయక్కర్లేదు. శనివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, వెంకటేశ్వర స్వామి ని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి.

బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి చపాతీ లాగా చేసేసి, దానితో ప్రమిదలాగా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి, వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెలిగించాలి. 8 శనివారాలు ఇలా చేయడం వలన, దోషాలన్నీ పోతాయి. దీపం పెట్టిన తర్వాత పూజ చేసేసుకోవాలి. ఇలా మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే, దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. శని దోషం వంటి సమస్యలు కూడా ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts