TV Remote : టీవీ రిమోట్ ప‌నిచేయ‌న‌ప్పుడు చేతుల్తో కొట్ట‌గానే ప‌నిచేస్తుంది.. ఎందుకో తెలుసా ?

TV Remote : సాధారణంగా మ‌న ఇండ్లలో చాలా ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు రిమోట్లు ఉంటాయి. అయితే మ‌నం ఎక్కువ‌గా వాడేది మాత్రం టీవీ రిమోట్‌నే. ఈ క్ర‌మంలోనే రోజూ మనం కొన్ని వంద‌ల సార్లు రిమోట్ బ‌ట‌న్స్‌ను ప్రెస్ చేస్తుంటాం. అయితే కొత్త‌లో ఏ రిమోట్ అయినా బాగానే ప‌నిచేస్తుంది. కానీ రాను రాను దాని ప‌నిత‌నం త‌గ్గుతుంది. ఇక చివ‌ర‌కు దాన్ని చేతుల్తో బ‌లంగా కొడితేనే ప‌నిచేస్తుంది. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే రిమోట్ ప‌నిచేయ‌క‌పోతే దాన్ని చేతుల్తో కొట్ట‌గానే చాలా సంద‌ర్భాల్లో ప‌నిచేస్తుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అస‌లు దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి ? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

why TV Remote works after hitting with hands
TV Remote

టీవీ రిమోట్‌లో వెనుక వైపు చిన్న కేస్ ఓపెన్ చేసి మ‌నం బ్యాట‌రీల‌ను వేస్తాం. అయితే అవి ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంటాయి. వాటిని కదిలించం. దీంతో బ్యాట‌రీల‌కు, స్ప్రింగ్‌ల‌కు మ‌ధ్య ఒక చిన్న ఆక్సిడేష‌న్ పొర ఏర్ప‌డుతుంది. దీంతో బ్యాట‌రీల నుంచి రిమోట్‌కు జ‌రిగే విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది.

సాధార‌ణంగా మ‌నం రిమోట్‌పై ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే రిమోట్ దాంట్లో ఉన్న బ్యాట‌రీల నుంచి చాలా త‌క్కువ మొత్తంలో విద్యుత్‌ను తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే బ్యాట‌రీల‌కు, స్ప్రింగ్‌ల‌కు మ‌ధ్య ఆక్సిడేష‌న్ పొర ఏర్ప‌డుతుందో అప్పుడు విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో రిమోట్ ప‌నిచేయ‌దు.

అయితే మ‌నం చేతుల్తో బ‌లంగా కొట్ట‌గానే ఆ ఆక్సిడేష‌న్ పొర విచ్ఛిన్నం అవుతుంది. అందుక‌నే మళ్లీ విద్యుత్ సర‌ఫ‌రా జ‌రిగి రిమోట్ ప‌నిచేస్తుంది. క‌నుక‌నే మ‌నం చాలా సంద‌ర్భాల్లో రిమోట్‌ను చేతుల్తో కొట్టిన వెంట‌నే ప‌నిచేస్తుంది. ఇదీ.. దాని వెనుక ఉన్న అస‌లు విష‌యం. అయితే బ్యాటరీల్లో ఉండే విద్యుత్ పూర్తిగా అయిపోయినా రిమోట్ ప‌నిచేయ‌దు. క‌నుక కొత్త బ్యాట‌రీలు వేసి ఆ విష‌యాన్ని ప‌రిశీలించాలి. దీంతో రిమోట్ ఎల్లప్పుడూ ప‌నిచేసేలా చూసుకోవ‌చ్చు.

Editor

Recent Posts