Tension : టెన్ష‌న్ భ‌రించ‌లేక‌పోతున్నారా ? వీటిని తీసుకుంటే టెన్షన్‌, ఒత్తిడి దెబ్బ‌కు పోతాయి..!

Tension : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ఒత్తిడి, ఆందోళ‌న‌ల మ‌ధ్య జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి డిప్రెష‌న్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎలా త‌గ్గించుకోవాలో చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ అది చాలా సుల‌భ‌మే. కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మ‌న‌స్సు హాయిగా ఉంటుంది. మ‌రి ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

take these foods daily to relieve from tension and stress
Tension

1. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలినిక్ యాసిడ్‌, ఈపీఏ, డీహెచ్ఏ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి ఆందోళ‌న‌ను త‌గ్గిస్తాయి. ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. ప్ర‌శాంతంగా మారేలా చేస్తాయి. దీంతో మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు చేప‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

2. విట‌మిన్ డి అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటున్నా టెన్ష‌న్‌, ఒత్తిడి నంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, ఆవు పాలు వంటి ఆహారాల‌ను రోజూ తీసుకుంటే మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. వీటిలో ఉండే జింక్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది.

4. డార్క్ చాకొలెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక వీటిని తింటున్నా ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

5. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగితే ఒత్తిడి అంతా మ‌టుమాయం అవుతుంది. అలాగ రోజుకు 2 క‌ప్పుల గ్రీన్ టీని సేవిస్తుంటే టెన్ష‌న్ అంతా పోతుంది. మ‌న‌స్సు కుదుట ప‌డుతుంది.

Share
Admin

Recent Posts