ఆధ్యాత్మికం

దేవుడి ముందు కర్పూరం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఇదే!

సాధారణంగా దేవతారాధనలకు ఒక నిర్దిష్ట సమయాలలో పూజలను నిర్వహిస్తారు. దేవుడికి ఈ విధంగా చేసే పూజలు వేళా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అందుకే మన పెద్దలు ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం, సాయంత్రం దేవుడికి పూజ చేయాలని చెబుతుంటారు. ఈ సమయంలో దేవుడికి చిత్తశుద్ధితో పూజలు చేయాలి.

ఈ విధంగా పూజ చేసే సమయంలో దేవుడికి ఫలమో, పుష్పమో సమర్పిస్తాము. అదేవిధంగా పూజ అనంతరం స్వామికి కర్పూర హారతులను కూడా ఇస్తుంటారు. స్వామి వారికి ఈ విధంగా పువ్వులను సమర్పించడం అంటే మనలోని ఉన్న దుర్వాసనను పువ్వుల రూపంలో స్వామివారి పాదాల చెంత వేసి వాటిని శుద్ధి చేసి మరలా ఆ పువ్వులను మనకు ఇస్తే మనం వాటిని శిరస్సులో ధరిస్తాము. ఈ విధంగా మనలో ఉన్న చెడు ఆలోచనలను పువ్వుల రూపంలో స్వామి వారి చెంతకు చేర్చి ఆ ఆలోచనలను పారద్రోలుతాము.

why we lit camphor before god

అదేవిధంగా పూజ అనంతరం దేవుడికి కర్పూర హారతులను వెలిగిస్తాము. ఈ విధంగా కర్పూర హారతులు వెలిగించడానికి గల కారణం.. మనలో ఉన్న అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి ఆ పరమాత్మకు సమర్పించడం. ఆ కర్పూరం కలిగినట్టే మనలో ఉన్న అహంకారం కూడా కరిగిపోతుందని చెప్పడానికి పూజ సమయంలో కర్పూర హారతులు ఇస్తారు.

Admin

Recent Posts