ఆధ్యాత్మికం

Yama Dharma Raja : చావు గురించి య‌మ‌ధ‌ర్మ రాజు చెప్పిన 5 ర‌హస్యాలు ఏమిటో తెలుసా..?

Yama Dharma Raja : చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది..? చావు రహస్యం ఏమిటి..? ఇత్యాది విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా.. వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఇక‌ మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Yama Dharma Raja told these secrets

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.

2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.

3. ఆత్మకు జననం, మరణం లేదు.

4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం.

5. యమధర్మ రాజు చెప్పిన దాని ప్రకారం దేవున్ని నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.

Admin

Recent Posts