ఆధ్యాత్మికం

Money Problems : శుక్ర‌వారం నాడు ఈ త‌ప్పుల‌ను చేశారో.. జీవితాంతం డ‌బ్బు స‌మ‌స్య వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Money Problems : హిందువులు శుక్ర‌వారం నాడు ల‌క్ష్మీదేవిని ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తూ ఉంటారు. స‌నాత‌న ధ‌ర్మంలో శుక్ర‌వారం ల‌క్ష్మీదేవికి అంకితం చేయ‌బ‌డింది. శుక్ర‌వారం నాడు ల‌క్ష్మీ దేవిని పూజించ‌డం వ‌ల్ల ప‌రిహారాలు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి భ‌క్తుల‌పై అనుగ్రహాన్ని కురిపిస్తుంద‌ని న‌మ్ముతారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కావాల‌నుకునే వారు శుక్ర‌వారం చేసే ప‌నుల‌తో పాటు చేయ‌కూడని ప‌నులు కూడా ఉంటాయి. జోతిష్య‌శాస్త్రం ప్రకారం శుక్ర‌వారం నాడు ఈ ప‌నులు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవికి కోపంవ‌చ్చి ఇంట్లో నుండి వెళ్లిపోతుందని మ‌నం ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంద‌ని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మనం ల‌క్ష్మ‌దేవి అసంతృప్తిని కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు.

జోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం శుక్ర‌వారం నాడు మ‌నం చేయ‌కూడ‌ని ప‌నులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. శుక్ర‌వారం నాడు మాంసాహారాన్ని తిన‌డం, మ‌ద్య‌పానం వంటివి చేయ‌కూడ‌దు. ఈ ప‌నులు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం వ‌స్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక శుక్ర‌వారం నాడు మ‌ద్య‌పాన సేవ‌నం, మాంసాహారాన్ని తీసుకోవ‌డం వంటివి చేయ‌కూడ‌దు. అలాగే జోతిష్య శాస్త్ర ప్ర‌కారం శుక్ర‌వారం నాడు ఇత‌రుల‌తో మాట్లాడేట‌ప్పుడు అస‌భ్య‌ప‌ద‌జాలాన్ని వాడ‌కూడ‌దు. ఇది మీ ఖ‌జానాను ఖాళీ చేస్తుంది. ఈ రోజున ఇత‌రుల‌తో గొడ‌వ‌ప‌డ‌డం, తిట్ట‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి మ‌నం గురి కావాల్సి వ‌స్తుంది. అదేవిధంగా శుక్ర‌వారం నాడు దానం చేస్తే మంచిద‌ని చాలా మంది న‌మ్ముతారు.

if you make these mistakes on friday you will get money problems

అయితే పొర‌పాటున కూడా శుక్ర‌వారం నాడు ఈ వ‌స్తువుల‌ను దానం చేయ‌కూడ‌దు. శుక్ర‌వారం నాడు వెండి, పంచ‌దార వంటి వాటిని దానం చేయ‌డం వ‌ల్ల శుక్ర‌గ్ర‌హం బ‌ల‌హీనప‌డుతుంది. అలాగే శుక్ర‌వారం నాడు ఇత‌రుల‌కు డ‌బ్బు ఇవ్వ‌కూడ‌దు మ‌రియు ఇత‌రుల నుండి డ‌బ్బు తీసుకోకూడ‌దు. ఇక శుక్ర‌వారం నాడు వంట‌గ‌దికి సంబంధించిన వ‌స్తువుల‌ను కూడా కొనుగోలు చేయ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంటికి ఐశ్వ‌ర్యం రాకుండా పోతుంది. అలాగే శుక్ర‌వారం నాడు చిరిగిన మ‌రియు మురికి దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల రాహువు బ‌ల‌హీన‌ప‌డుతుంది. క‌నుక శుక్ర‌వారం నాడు పొర‌పాటున కూడా ఈ పనుల‌ను చేయ‌కూడ‌దని ఈ పనులు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి గురి కాక‌త‌ప్ప‌ద‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts