mythology

శ్రీకృష్ణుడు తన గురువుకు చెల్లించిన గురుదక్షిణ ఏమిటో తెలుసా ?

పూర్వకాలంలో గురువుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునేవారు చదువులు ముగిశాక గురువులకు గురు దక్షిణ చెల్లించేవారు. అయితే విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు గురుదక్షిణ చెల్లించడం పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారం. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా విద్యాబుద్ధులు నేర్చుకున్నందుకుగాను ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ తమ గురువు చెల్లించని గురుదక్షిణ చెల్లించి చరిత్రలో నిలిచారు. మరి కృష్ణుడు తన గురువుకు చెల్లించిన గురుదక్షిణ ఏమిటి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

విష్ణువు 8వ అవతారంగా జన్మించిన శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులను నేర్చుకోవడానికి చేరుతాడు. ఆ ఆశ్రమంలో సకల విద్యలు నేర్చుకున్న శ్రీ కృష్ణుడు తన గురువుకు ఏదైనా మంచి గురుదక్షిణ ఇవ్వాలని మనసులో భావిస్తాడు. ఈ క్రమంలోనే తన మనసులో ఉన్న మాటను తన గురువు ముందు ఉంచగా అందుకు గురుపత్ని కన్నీటి పర్యంతం అవుతూ తమకు గురుదక్షిణగా ప్రభాస తీర్థంలో తప్పిపోయిన తన కుమారుడిని తిరిగి ఇవ్వమని కోరుతుంది. అయితే ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ శ్రీకృష్ణుడు తన గురువు అడిగిన గురుదక్షిణ ఇవ్వాలని పట్టుదలతో ముందుకు సాగుతాడు.

what lord sri kirshna given to his teacher

ఈ క్రమంలోనే ప్రభాస తీర్థం వద్ద ఉన్న సముద్ర తీరంలో కృష్ణుడు స్నానమాచరిస్తాడు. దీంతో తమ గురువు కొడుకును పాంచజన్యమనే రాక్షసుడు అపహరించాడనే విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడితో పోరాటం చేసి అతనిని చంపి అతని వద్ద బందీ అయిన గురుపుత్రున్ని విడిపించి గురుదక్షిణగా గురుపత్ని చేతిలో పెడతాడు. ఈ విధంగా తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఇప్పటివరకు ఎవరూ కూడా ఇవ్వని, వెలకట్టలేని గురుదక్షిణ ఇచ్చి తన గురువును ఎంతో సంతోష పరిచాడు.

Admin

Recent Posts