lifestyle

Nail Shapes : ఎదుటి వారు ఎలాంటి వారో వారి గోర్లు చూసి ఇలా చెప్పేయ‌వ‌చ్చ‌ట‌..!

Nail Shapes : మ‌నం సాధార‌ణంగా ఎదుటి వారు ఎలాంటివారు, వారి మ‌న‌స్త‌త్వం, వ్య‌క్తిత్వం ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు ఏం చేస్తాం ? వారిని కింద నుంచి పైదాకా ఓసారి ప‌రిశీలిస్తాం. వారి భౌతిక రూపం, వారి అల‌వాట్లు, మాట తీరు, ప్ర‌వ‌ర్తించే విధానం.. ఇలా ర‌క ర‌కాల అంశాల‌ను బట్టి ఎదుటి వారి వ్య‌క్తిత్వాన్ని అంచ‌నా వేస్తాం. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఎదుటి వారి గోర్లు, వాటి ఆకారం త‌దిత‌ర అంశాల‌ను చూసి కూడా వారి వ్య‌క్తిత్వాన్ని చెప్ప‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పొడవైన, వెడల్పైన, దీర్ఘ చతురస్రాకార గోర్లు ఉంటే.. వీరు పుట్టుక‌తోనే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటారు. వీరికి బాధ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తి ప‌నిలోనూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తారు. అన్ని ర‌కాల‌గా స‌మ‌తౌల్య‌మైన వ్య‌క్తిత్వాన్ని వీరు క‌లిగి ఉంటారు. శాంత‌మూర్తులు అయి ఉంటారు. ఏ విష‌యంలోనైనా వీరిని ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేరు. వీరు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తారు. మొద‌లు పెట్టే ప‌నిని క‌చ్చితంగా పూర్తి చేసే కార్య‌సాధ‌కులు అయి ఉంటారు. ప్ర‌తి అంశంలోనూ ఎంతో విశాల దృక్ప‌థంతో ఆలోచ‌న‌లు చేస్తారు.

you can tell anyone personality by looking at their nails

పొడవైన, సన్నని గోర్లు.. వీరికి లగ్జ‌రీ లైఫ్‌ను అనుభ‌వించాల‌ని ఉంటుంది. అలాంటి లైఫ్‌ను, సౌక‌ర్యాల‌ను వీరు ఎక్కువ‌గా ప్రేమిస్తారు. తాము అనుకున్న‌ది సాధించ‌క‌పోయినా, ల‌భించ‌క‌పోయినా తీవ్రంగా క‌ల‌త చెంది మ‌న‌స్థాపానికి లోన‌వుతారు. వీరు ప‌లు అంశాల్లో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ‌పై ఎలాంటి నింద ప‌డ‌కుండా చూసుకుంటారు. అలాగే కొంత అహంకారం కూడా వీరికి ఎక్కువ‌గా ఉంటుంది. చిన్న‌ని చ‌తుర‌స్రం గోర్ల‌ను క‌లిగి ఉండేవారు ఇత‌రుల‌కు స‌హాయం చేస్తారు. మంచివారుగా ఉంటారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముందుకు సాగుతారు. వీరికి ఆలోచ‌న‌, స‌మ‌య‌స్ఫూర్తి ఎక్కువ‌. ఏ విష‌యంలోనూ తొంద‌ర‌ప‌డ‌రు. బాగా ఆలోచించే నిర్ణ‌యం తీసుకుంటారు. కానీ వీరు దూకుడుగా ఉంటారు. విప‌రీత‌మైన ఈర్ష్య‌, అసూయ‌లు వీరికి ఉంటాయి. వీరికి డబ్బు యావ ఎక్కువ‌.

చిన్న గోర్లు ఉండే వారు పరిపూర్ణవాదులుగా ఉంటారు. తమకు నచ్చినట్లు పనులు చేయించుకుంటారు. అందుకు బాగా పోరాడుతారు, క‌ష్ట‌ప‌డుతారు. వీరు చాలా అసహనానికి లోనవుతారు. చాలా త్వరగా కోపం వ‌స్తుంది. కానీ సమయస్ఫూర్తి ఎక్కువ‌. వీరికి ఇత‌రుల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని కోరికగా ఉంటుంది. బాదం ఆకారంలో ఉండే గోర్లు.. ఈ త‌ర‌హా గోర్లు ఉండేవారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ప్ర‌తి అంశంలోనూ భావోద్వేగంగా ఉంటారు. చాలా సులభంగా మనస్థాపానికి లోనవుతారు. మరో వైపు వీరికి స‌హాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో దయాగుణం కలిగి ప్రేమగా వ్యవహరిస్తూ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. వీరికి ఆదర్శవాద దృక్పథం ఎక్కువగా ఉంటుంది.

ముక్కోణపు గోర్లు.. ఈ త‌ర‌హా గోర్లు ఉండేవారు ఓడిపోవడాన్ని విపరీతంగా ద్వేషిస్తారు. ఓట‌మిని అంత సుల‌భంగా అంగీకరించ‌రు. అందరూ తమని గుర్తించాలని, తాము చాలా ప్రసిద్ధి చెందాలని భావిస్తారు. వీరికి కళాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరి ఆలోచనలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. వీటన్నింటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా మారుతూ ఉంటుంది. ఈ వ్యక్తులది చాలా సున్నితమైన మనస్తత్వం అయి ఉంటుంది.

Admin

Recent Posts