Bones Health Tips : వీటిని రోజూ తీసుకుంటే.. అరిగిపోయిన ఎముక‌లు సైతం ఉక్కులా మారుతాయి..

Bones Health Tips : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో మోకాళ్ల నొప్పుల బారిన ప‌డుతుంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ నొప్పి అనుభ‌వించే వారికే ఆ బాధ తెలుస్తుంది. మోకాళ్ల స‌మ‌స్యను నిర్ల‌క్ష్యం చేస్తే ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. రోజూ వారి ప‌నులు కూడా చేసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఈ మోకాళ్ల నొప్పుల‌ను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో మెంతులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మెంతుల‌ను ఔష‌ధ దినుసులుగా ఆయుర్వేదంలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. మోకాళ్ల నొప్పులను త‌గ్గించ‌డంలో మెంతులు అద్భుతంగా ప‌ని చేస్తాయి.

ప్ర‌తిరోజూ రాత్రి ప‌డుకునే ముందు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని తాగుతూ మెంతుల‌ను న‌మిలి మింగాలి. మెంతులను తిన‌డానికి మొద‌ట ఇబ్బందిగా అనిపించినా త‌రువాత అదే అల‌వాటుగా మారుతుంది. మెంతులు శ‌రీరంలో వేడిని ఎక్కువ‌గా క‌లిగిస్తాయి. క‌నుక గ‌ర్భ‌వ‌తులు, పాలిచ్చే త‌ల్లులు ఈ చిట్కాను పాటించ‌కూడ‌దు. అధిక వేడితో బాధ‌ప‌డే వారు కూడా ఈ చిట్కాను పాటించ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా మెంతుల నీటిని తాగుతూ మెంతుల‌ను తిన‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇక మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో అవిసె గింజ‌లు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Bones Health Tips in telugu take these foods daily
Bones Health Tips

వీటిలో ఉండే పోష‌కాలు మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అవిసె గింజ‌ల‌ను రోజు వారి ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే విధంగా మోకాళ్ల నొప్పులతో బాధ‌ప‌డే వారు వారి రోజు వారి ఆహారంలో నువ్వుల‌ను కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాలి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో నువ్వులు ఎంత‌గానో దోహ‌దప‌డ‌తాయి. ఇవి ఎముక‌ల‌ను ధృడంగా, బ‌లంగా మారుస్తాయి. అధిక ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో, గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో కూడా నువ్వులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే నీటిలో అల్లం ముక్క‌లు వేసి మ‌రిగించాలి.

ఇలా త‌యారు చేసుకున్న అల్లం టీ లో నిమ్మ‌రసం, తేనె క‌లిపి తాగ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ అల్లం టీ లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అదేవిధంగా మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహార‌ప‌దార్థాల‌ను వారి రోజు వారి ఆహారంలో తీసుకోవాలి. టీ, కాఫీ ల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగాలి. కొబ్బ‌రి నూనెను గోరు వెచ్చ‌గా చేసి నొప్పులు ఉన్న చోట రాస్తూ మ‌ర్ద‌నా చేయాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి మ‌నం స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts