Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height Increase : మన శరీరం ఒక దశ తరువాత ఎత్తు పెరగదు. 18 నుంచి 20 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలోనే కొందరు తమ వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ పరంగా బాగా ఎత్తు పెరుగుతారు. కొందరు తక్కువ ఎత్తు పెరుగుతారు. ఇక ఒక వయస్సు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ పెట్డడం వల్ల వారు ఎత్తు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేస్తాయి. మరి ఎత్తు పెరగాలంటే చిన్నారులకు రోజూ తినిపించాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Children Height Increase give these foods to your kids

1. చిన్నారులు ఎత్తు బాగా పెరిగేందుకు కాల్షియం బాగా అవసరం అవుతుంది. కాల్షియం ఎక్కువగా సోయా ఉత్పత్తుల్లో లభిస్తుంది. కనుక సోయా ఉత్పత్తులను రోజూ చిన్నారులకు ఇస్తుంటే వారు ఎత్తు పెరుగుతారు. సోయా బీన్స్‌, సోయా మిల్క్‌ను రోజూ చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

2. పాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక రోజూ పిల్లలకు ఒక గ్లాస్‌ పాలను ఇవ్వాలి. పాలలో కాల్షియంతోపాటు విటమిన్‌ డి, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి చిన్నారులు ఎత్తు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయి.

3. మాంసాహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు. మాంసాహారం వల్ల శరీరానికి ప్రోటీన్లు బాగా లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానాకి దోహదం చేస్తాయి. అయితే నాన్‌ వెజ్‌ తినలేని వారికి ప్రోటీన్లు అధికంగా ఉండే వెజ్‌ ఆహారాలను ఇవ్వవచ్చు. క్యాబేజీ, కాలిఫ్లవర్‌, పప్పు దినుసులు, శనగలు, పెసలు, పచ్చి బఠానీలు, చిక్కుడు జాతి గింజలు, రాజ్మా.. వంటివి అద్భుతమైన ఆహారాలు. వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని కూడా చిన్నారులకు రోజూ తినిపించవచ్చు. దీంతో వారు ఎత్తు బాగా పెరుగుతారు.

4. పిల్లలకు తప్పనిసరిగా రోజుకు ఒక గుడ్డు తినిపించాలి. దీంతో కాల్షియం, ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు చిన్నారులకు లభిస్తాయి. ఇవి వారి ఎత్తును పెంచేందుకు దోహదం చేస్తాయి.

5. బెండకాయల్లో విటమిన్లు, ఫైబర్‌, మినరల్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్‌ ఎ, బి, డి, ఇలు ఉంటాయి. అందువల్ల చిన్నారులకు తరచూ బెండకాయలను ఆహారంగా ఇస్తుండాలి. దీంతో వారు ఎత్తు పెరుగుతారు.

6. ఆకుకూరల్లోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీర పెరుగుదలకు కావల్సిన కాల్షియం, ప్రోటీన్లతోపాటు ఇతర ముఖ్యమైన పోషకాలు వాటిల్లో ఉంటాయి. అవి చిన్నారులను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో వారు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. ఎత్తు బాగా పెరుగుతారు. ఈ ఆహారాలను తప్పనిసరిగా చిన్నారులకు ఇస్తుండాలి. దీని వల్ల 18 ఏళ్లు నిండే సరికి వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు.

Admin

Recent Posts