Walking : రోజూ వాకింగ్‌ చేస్తూనే 30 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.. ఎలాగంటే..?

Walking : అధిక బరువును తగ్గించుకోవాల్సి వస్తే.. చాలా మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ కఠిన వ్యాయామాలను చేయడంతోపాటు డైట్‌ పాటిస్తుంటారు. అయితే అధిక బరువును వేగంగా తగ్గించుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు త్వరగా తగ్గడం అనేది అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. దీని కోసం ఇంకా కఠినంగా వ్యాయామాలను చేస్తూ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది.

you can reduce your weight by 30 kilo grams with Walking

అయితే రోజూ వాకింగ్‌ చేయడం ద్వారానే వేగంగా బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆ ప్రయత్నాన్ని సాధించవచ్చు. అవును.. అయితే అందుకు గాను రోజూ నిర్దిష్టమైనన్ని నిమిషాల పాటు కచ్చితంగా వాకింగ్‌ చేయాల్సి ఉంటుంది. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉంటారు. కానీ బరువు వేగంగా తగ్గాలంటే మాత్రం ఇంకా ఎక్కువ నిమిషాల పాటు వాకింగ్‌ చేయాల్సి ఉంటుంది.

సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. రోజూ 50 నుంచి 70 నిమిషాల పాటు వేగంగా వాకింగ్‌ చేయడం వల్ల వారానికి దాదాపుగా 3 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. 12 వారాల పాటు ఇలా చేస్తే కనీసం 20 నుంచి 30 కిలోల మేర బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విధంగా బరువు తగ్గాలంటే రోజూ 50 నుంచి 70 నిమిషాల పాటు వేగంగా వాకింగ్‌ చేయడమే కాదు.. సరైన ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అధిక బరువు వేగంగా తగ్గాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పిండి పదార్థాలను తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా డైట్‌ను పాటిస్తేనే పైన చెప్పినట్లుగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. లేదంటే అధిక బరువు వేగంగా తగ్గడం సాధ్యం కాదు.

అయితే రోజూ 50 నుంచి 70 నిమిషాల పాటు వేగంగా నడవలేకపోతే కనీసం 5 కిలోమీటర్ల దూరం అయినా నడవాలని అప్పుడు వేగంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. వాకింగ్‌ ద్వారా రోజుకు కనీసం 500 నుంచి 800 క్యాలరీలు ఖర్చయ్యేలా నడిస్తే ఫలితం సాధించవచ్చని చెబుతున్నారు.

రోజూ వాకింగ్‌ ద్వారా అధికంగా క్యాలరీలు ఖర్చవ్వాలంటే.. వేగంగా నడవాలి. మెట్లను ఎక్కుతూ వేగంగా వాకింగ్‌ చేయవచ్చు. ఒకేసారి వేగంగా నడవకుండా నెమ్మదిగా వేగం పెంచాలి. రోజూ కొన్ని ఎక్కువ నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తూ రోజుకింత అని సమయం పెంచుతూ పోవాలి. కొండలా ఉండే ప్రాంతంపైకి ఎక్కుతూ వాకింగ్‌ చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. మార్కెట్‌లో పెడోమీటర్‌ లు లభిస్తున్నాయి. వాటితో మనం రోజూ ఎంత దూరం నడుస్తున్నామో సులభంగా లెక్కించవచ్చు. లేదా స్మార్ట్‌వాచ్‌లు, బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు. ఫోన్లలో పెడోమీటర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నా రోజూ ఎంత దూరం నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. దీంతో రోజూ అనుకున్నంత దూరం నడవడం సులభతరం అవుతుంది.

Admin

Recent Posts