Mangoes : మామిడి పండ్లను అధికంగా తింటే ప్రమాదం.. జరిగేది ఇదే..!

Mangoes : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మామిడి పండ్లలో కొన్ని మరీ తియ్యగా ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కెలతోపాటు కాపర్‌, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్‌ కూడా అధికంగానే ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అయితే మామిడి పండ్ల వల్ల లాభాలు పొందాలంటే వీటిని రోజూ పరిమిత మోతాదులోనే తినాలి. అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

మామిడి పండ్ల వల్ల కొందరికి లేటెక్స్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే.. ఈ పండ్లు సహజసిద్ధమైన లేటెక్స్‌లా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థను కదిలించి సుఖ విరేచనం అయ్యేలా చేస్తాయి. కనుక అధికంగా తింటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మామిడి పండ్లను తక్కువ మోతాదులోనే తినాలి. ఇక ఈ పండ్లను అధికంగా తింటే గొంతు వద్ద వాపులు వస్తాయి. దీంతో తినడం, తాగడం, శ్వాస తీసుకోవడం అనే పనులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి మామిడి పండ్లను తినేవారు మోతాదుకు మించకుండా చూసుకోవాలి.

do you know what happens is you eat Mangoes excessively
Mangoes

మామిడి పండ్లు తియ్యగా ఉంటాయి. వీటిల్లో ఉండేది సహజసిద్దమైన చక్కెరనే. కానీ వీటిని మోతాదులోనే తినాలి. అధికంగా తింటే షుగర్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తినాలి. ఎక్కువగా తింటే షుగర్‌ లెవల్స్‌ పెరిగి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఈ పండ్లను తినే విషయంలో మధుమేహ వ్యాధి గ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి.

మలబద్దకం సమస్య ఉన్నవారికి మామడి పండ్లు అద్భుతమైన వరమని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది. అయితే అలా అని చెప్పి ఈ పండ్లను అధికంగా తింటే మొదటికే మోసం వస్తుంది. విరేచనాలు అవుతాయి. కాబట్టి తక్కు మొత్తంలో వీటిని తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు మామిడి పండ్లను తక్కువగా తినాలి. వీటి ద్వారా క్యాలరీలు అధికంగా లభిస్తాయి. కనుక బరువు తగ్గేందుకు యత్నిస్తున్నవారు వీటిని తక్కువగా తినాలి. లేదా తినకపోవడమే మంచిదని చెప్పవచ్చు.

ఇక మార్కెట్‌లో మనకు కార్బైడ్‌ వేసి పండించిన మామడి పండ్లే అధికంగా లభిస్తున్నాయి. వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లనే తినాలి. అప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి.

D

Recent Posts