Watermelon : వేస‌వి వ‌చ్చేసింది.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం ఇప్ప‌టి నుంచే ప్రారంభించండి..!

Watermelon : ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా వేస‌వి వ‌చ్చేసింది. మార్చి నెల ఆరంభంలోనే ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో మే నెల వ‌ర‌కు ఎండ‌లు ఇంకా ఎక్కువ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఇప్ప‌టి నుంచే వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవాలి. దీంతో వేస‌విలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు. ఇక పుచ్చ‌కాయ‌ల‌ను ఇప్ప‌టి నుంచే తిన‌డం ప్రారంభించాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఇప్ప‌టి నుంచే పొంద‌వ‌చ్చు. మ‌రి పుచ్చ‌కాయ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

eat Watermelon from now onwards as summer started
Watermelon

1. పుచ్చ‌కాయ‌ల్లో 92 శాతం నీరే ఉంటుంద‌. క‌నుక వీటిని తింటే శ‌రీరానికి నీరు పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఈ సీజ‌న్‌లో డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా, ఎండ‌దెబ్బ‌కు గురికాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

2. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి పుచ్చ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

3. పుచ్చ‌కాయ‌ల్లో విట‌మిన్ ఎ, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను సంర‌క్షిస్తాయి. క‌నుక పుచ్చ‌కాయ‌ల‌ను రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

4. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు పుచ్చ‌కాయ‌ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. వీటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆస్త‌మా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల నోరు శుభ్రంగా మారుతుంది. నోట్లోని బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

6. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న‌వారు పుచ్చ‌కాయ‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. పుచ్చకాయ‌ల‌ను తింటే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. చిన్నారులు చ‌దువుల్లో రాణిస్తారు.

8. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీలకు ఎంత‌గానో మేలు జ‌రుగుంది. కిడ్నీలలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

9. పుచ్చ‌కాయ‌ల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌రుస్తుంది. కంటి స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

10. పుచ్చ‌కాయ‌ల‌ను తింటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట‌, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Share
Admin

Recent Posts