Fruits For Diabetes : డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే టైప్ 1 డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించలేం. కానీ జీవన విధానంలో పలు మార్పులు చేసుకుంటే టైప్ 2 డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ క్రమంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించలి. ముఖ్యంగా పలు రకాల పండ్లను రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు తినాల్సిన ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సీజన్‌లో మనకు నేరేడు పండ్లు అధికంగా లభిస్తాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి వరమనే చెప్పవచ్చు. ఇవి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. పైగా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. అందువల్ల రోజూ నేరేడు పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే అన్‌సీజన్‌లో నేరేడు పండ్ల ఆకులను నీటిలో వేసి మరిగించి డికాషన్ తయారు చేసి తాగవచ్చు. దీంతో కూడా షుగర్ తగ్గుతుంది. ఇక కివీ పండ్లు కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
కివీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండ్లను చాలా మంది తింటుంటారు. ఈ పండ్లలో విటమిన్ కె, ఫైబర్ కూడా ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. అందువల్ల షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు మేలు చేస్తాయి. రోజూ ఒకటి లేదా రెండు కివీ పండ్లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇక ద్రాక్ష పండ్లను తిన్నా కూడా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ద్రాక్ష పండ్లలో విటమిన్లు కె, సి కూడా ఉంటాయి. ఇవి కూడా షుగర్ తగ్గేందుకు సహాయం చేస్తాయి.
పుల్లని పండ్ల జాబితాకు చెందిన వాటిల్లో పియర్ పండ్లు కూడా ఒకటి. ఇది కాస్త తీపిగా ఉంటుంది. అయినప్పటికీ విటమిన్ సి, ఫైబర్ వీటిల్లో అధికంగానే ఉంటాయి. ఈ పండ్లు షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని కూడా రోజుకు ఒకటి లేదా రెండు తినవచ్చు. షుగర్ అదుపులో ఉంటుంది.