Sapota : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో సపోటా పండు కూడా ఒకటి. ఈ పండును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. సపోటా పండు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. కాలానుగుణంగా లభించే పండ్లల్లో ఇది ఒకటి. సపోటా పండు రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో క్యాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను రోజుకు రెండు చొప్పున తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సపోటా పండును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో వ్యర్థాలు తొలగిపోతాయి. పొట్ట, ప్రేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ పండును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
అలాగే ఈ పండును తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరుకుండా ఉంటాయి. అలాగే ఈ పండును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండును తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించి నీరసం వెంటనే తగ్గుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు సపోటా పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా సపోటా పండ్లను తినడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు కూడా తగ్గుతాయి. శీఘ్రస్కలనం, వీర్య కణాలు తక్కువగా ఉండడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ పండ్లల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోవడం వల్ల చక్కటి మేలు కలుగుతుంది. నరాల ఒత్తిడిని, శరీర బలహీనతను తగ్గించడంలో కూడా సపోటా పండ్లు మనకు సహాయపడతాయి.
అదే విధంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు కూడా సపోటా పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో , రక్తపోటును అదుపులో ఉంచడంలో , అలాగే శరీరంలో వచ్చే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా సపోటా పండ్లు మనకు సహాయపడతాయి. ఈ విధంగా సపోటా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని రోజూ తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.