Pomegranate Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో దానిమ్మ పండ్లు ఒకటి. ఇవి లోపల చూడచక్కని ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే వాస్తవానికి ఈ పండ్లను రోజూ తినాలి. రోజూ ఒక కప్పు దానిమ్మ పండ్ల గింజలు లేదా ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం టీ, కాఫీలకు బదులుగా ఈ పండ్లను తినాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి. రోగాల బారి నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. క్యాన్సర్ రోగులకు దానిమ్మ పండ్లు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. కనుక వీటిని రోజూ తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అలాగే జీర్ణవ్యవస్థ మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. దీంతోపాటు మూత్రం కూడా ధారాళంగా వస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఈ సీజన్ లో మనకు దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే రోజూ దానిమ్మ పండ్లను తినాలి. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
దానిమ్మ పండ్లను తినడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ పండ్లను తినడం వల్ల చిన్నారుల్లో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. దీంతో వారు ఉత్తేజంగా మారుతారు. చదువుల్లో రాణిస్తారు. ఇలా దానిమ్మ పండ్లను రోజూ తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.