Nuts And Seeds Powder : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం జీవితకాలం పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను వాడడం వల్ల అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, కంటి చూపు మందగించడం, మతిమరుపు, బీపీ, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, క్యాల్షియం లోపంతో వచ్చే ఎముకల సమస్యలు , రక్తహీనత, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి అనేక సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. అలాంటి వారందరూ ఈ చిట్కాను పాటించడం వల్ల ఆయా సమస్యల నుండి శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.
ఈ చిట్కాను మన ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. ఇంట్లో ఉండే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ చిట్కాను వాడవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడేసే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ వాల్ నట్స్ ను, ఎండు కొబ్బరిని, అవిసె గింజలను, పుచ్చకాయ గింజలను, బాదం పప్పును, పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పదార్థాలన్నింటిని కొద్ది మోతాదులో తీసుకుని ఒకజార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒకేసారి ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిల్వ ఉంచి ప్రతిరోజూ వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజూ రాత్రి పాలల్లో ఒక టీ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. పెద్దవారు ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ఒక టీ స్పూన్ మోతాదులో పాలల్లో కలిపి ఇవ్వవచ్చు. ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటు పాటించడం వల్ల శరీరంలో మార్పును మనం గమనించవచ్చు.
ఈ పొడిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ పొడిని తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతాన లేమి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కాను తయారు చేయడానికి వాడిన పదార్థాల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.