Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

Date Seeds : ఖ‌ర్జూరాలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక పిల్లల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ ఖ‌ర్జూరాల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఖ‌ర్జూరాల‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అలాగే శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక మార్కెట్‌లో మ‌న‌కు ఖ‌ర్జూరాలు విత్త‌నాల‌తోనూ, విత్త‌నాలు లేకుండా కూడా ల‌భిస్తాయి. అయితే వాస్త‌వానికి ఖ‌ర్జూరాలే కాదు.. ఖ‌ర్జూరాలలో ఉండే విత్తనాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఖ‌ర్జూరాల‌ను తిని చాలా మంది వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేస్తుంటారు. కానీ విత్త‌నాల‌ను ప‌డేయ‌రాదు. వాటిని కూడా తీసుకోవ‌చ్చు. వాటిని ఎండ‌బెట్టి పొడి చేసి రోజూ ఒక టీస్పూన్ మోతాదులో గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి తీసుకోవ‌చ్చు. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల విత్త‌నాల‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖ‌ర్జూరాల విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా వీటిని తీసుకుంటే డీఎన్ఏ నాశ‌నం జ‌ర‌గ‌కుండా ఉంటుంది. డీఎన్ఏ ర‌క్షించ‌బ‌డుతుంది. అలాగే లివ‌ర్ లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. ఇక ఈ విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ విత్త‌నాల్లో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు. రోగాలు రాకుండా ఉంటాయి.

Date Seeds benefits in telugu how to use them
Date Seeds

ఖ‌ర్జూరాల విత్తనాల‌ను తీసుకుంటే కిడ్నీలు, లివ‌ర్ చెడిపోకుండా ఉంటాయి. ఈ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రావు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇక ఈ విత్త‌నాల నుంచి తీసే నూనెను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. క‌నుక ఇక‌పై ఖ‌ర్జూరాల‌ను తింటే.. వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి. వాటితో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts