Fish Masala Curry : ఎంతో రుచిక‌ర‌మైన ఫిష్ మ‌సాలా కర్రీ.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Fish Masala Curry : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేప‌ల‌ను కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేప‌ల‌తో వేపుడు, ఇగురు, పులుసు వంటి కూర‌ల‌ను చేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. ఇక మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లోనూ వివిధ ర‌కాల చేప‌ల వంట‌కాలు ల‌భిస్తుంటాయి. వాటిల్లో ఫిష్ మ‌సాలా క‌ర్రీ ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా ఇళ్ల‌లో చేయ‌రు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా ఉండే ఫిష్ మసాలా క‌ర్రీని ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారీ కూడా సుల‌భ‌మే. ఫిష్ మ‌సాలా క‌ర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప‌లు – అర కిలో, ప‌సుపు – ముప్పావు టేబుల్ స్పూన్‌, కారం – 1 టేబుల్ స్పూన్‌, ఉప్పు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, ఉల్లిపాయ‌లు – 1 క‌ప్పు (స‌న్న‌గా త‌ర‌గాలి), ప‌చ్చి మిర్చి – 6, ట‌మాటాలు – 1 క‌ప్పు (స‌న్న‌గా త‌ర‌గాలి), ధ‌నియాలు – 1 టేబుల్ స్పూన్‌, న‌ల్ల మిరియాలు – అర టేబుల్ స్పూన్‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, ఎండు కొబ్బ‌రి – అర క‌ప్పు, నూనె – 5 టేబుల్ స్పూన్లు, పుదీనా – 1 టేబుల్ స్పూన్‌, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 200 ఎంఎల్‌.

Fish Masala Curry recipe in telugu very tasty how to make
Fish Masala Curry

ఫిష్ మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసే విధానం..

చేప ముక్క‌ల‌ను మీడియం సైజ్‌లో క‌ట్ చేయాలి. అనంతరం వాటిని ప‌సుపు, ఉప్పుతో శుభ్రం చేయాలి. వాటిని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, ఉప్పు వేసి బాగా క‌లియ‌బెట్టాలి. అనంత‌రం వాటిని ప‌క్క‌న పెట్టి మారినేట్ చేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయ‌లు, ట‌మాటాలు, ప‌చ్చి మిర్చి వేసి మెత్త‌ని పేస్ట్‌లా ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక పాన్‌లో ధ‌నియాలు, యాల‌కులు, న‌ల్ల మిరియాలు, ఎండు కొబ్బ‌రి, ల‌వంగాలు వేసి వాటిని డ్రై రోస్ట్ చేయాలి. చ‌క్క‌ని వాస‌న రాగానే వాటిని ప్లేట్‌లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని నూనె వేసి కాగాక చేప‌లు వేసి ఫ్రై చేయాలి. కాస్త రంగు మార‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి చేప ముక్క‌ల‌ను ఇంకో ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు మ‌సాలా దినుసులు చ‌ల్లారిన త‌రువాత వాటిని మెత్త‌ని పొడిలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పాన్‌లో మ‌రి కాస్త నూనె వేసి ట‌మాటా, ఉల్లిపాయల మిశ్ర‌మం, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి స‌న్న‌ని మంట‌పై ఉడికించాలి. 1 నిమిషం అయ్యాక కొబ్బ‌రి మ‌సాలా పొడి మిక్స్‌ను వేయాలి. అనంతరం చేప‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి. దీంతో కూర రెడీ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర‌, పుదీనా ఆకుల‌ను పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన ఫిష్ మ‌సాలా క‌ర్రీ రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే భ‌లే టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడూ చేసే చేప‌ల కూర‌కు బ‌దులుగా ఇలా ఒక‌సారి ట్రై చేసి చూడండి. అందరికీ న‌చ్చుతుంది.

Editor

Recent Posts