Sesame Walnut Laddu : ప్రస్తుత కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిన వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కడా ఒకటి. మన శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఐరన్ లోపించడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి కణాలకు ఆక్సిజర్ సరఫరా సరిగ్గా సాగదు. దీంతో చిన్న పనులకే అలసిపోవడం, జుట్టు రాలడం, ఏ పని మీద శ్రద్ద పెట్టకపోవడం, చర్మం పొడిబారడం, మొటిమల వంటి సమస్యలు తలెత్తడం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పాలిపోవడం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలన్న, ఎముకలు ధృడంగా ఉండాలన్న, మన కండరాలు సక్రమంగా పని చేయాలన్నా మన శరీరానికి తగినంత ఐరన్ ను అందించడం చాలా అవసరం. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభించడంతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మనం బయటపడవచ్చు.
దీనికోసం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక లడ్డూను తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించే ఈలడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ మనం నువ్వులను, వాల్ నట్స్ ను, బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మూడింటిని సమానంగా తీసుకుని విడివిడిగా పొడిగా చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తరువాత తగినంత నెయ్యి వేసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజూ ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ తో ఇతర ముఖ్యమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ లడ్డు తిని ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పుల నుండి బయటపడవచ్చు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా రక్తహీనత సమస్యను తగ్గించడంలో అంజీరా పండ్లు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంజీరా పండ్లల్లో ఎన్నో రకాల పోషకాలతో పాటు ఫైటో కెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్య నుండి బయటపడాలంటే అంజీరా పండ్లను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ పాలల్లో రెండు అంజీరాలను వేసి బాగా మరిగించాలి. తరువాత పాలను తాగి అంజీరాలను తినాలి. అంజీరాలను ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. దీంతో మనం చాలా సులభంగా రక్తహీనత సమస్యను చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇలా లడ్డూలను తయారు చేసుకుని తీసుకోవడంతో పాటు అంజీరాలను తీసుకోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించి పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ చిట్కాలను పాటించడం వల్ల అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.