Dry Coconut : రోజూ చిన్న ఎండు కొబ్బ‌రి ముక్క‌ను త‌ప్ప‌క తినాలి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Dry Coconut : ఎండు కొబ్బ‌రిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా ప‌లు ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో కొబ్బ‌రిని తురుము ప‌ట్టి వేస్తుంటారు. అలాగే కొబ్బ‌రితో తీపి వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. అయితే ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరిలోనే ఎక్కువ ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరి జీర్ణం అవటానికి కాస్త సమయం పట్టినా ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఎన్నో లాభాల‌ను పొందవచ్చు.

take small piece of Dry Coconut everyday for these benefits
Dry Coconut

ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో ఉండే ప్రోటీన్లు మ‌న శ‌రీరంలో సెలీనియంను పెంచుతాయి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. అలాగే ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే సమ్మేళ‌నం ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మెదడు చురుగ్గా ఉంటుంది. ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా, అల‌ర్ట్‌గా ఉంటారు.

ఇక ఎండు కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మెదడులోని నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. పక్షవాతం నుండి కాపాడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే మతి మరుపు సమస్యలు దూరం అవుతాయి. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండుకొబ్బరి ని తిన‌డం వలన రక్తం బాగా త‌యార‌వుతుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మంచి ప్రయోజనం కనబ‌డుతుంది. ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్సర్, హెమరాయిడ్స్ వంటి జీర్ణ సంబంధ‌ సమస్యలు ఉండవు. కొబ్బరిలో ఫినోలిన్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కణాలకు జ‌రిగే నష్టాన్ని నివారిస్తాయి. అలాగే గల్లిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, పి-కొమరిక్ యాసిడ్ ఎండు కొబ్బ‌రిలో ఉంటాయి. ఇవి శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీనివ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎండు కొబ్బ‌రిని రోజూ చిన్న ముక్క తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts