Business Ideas : డబ్బు సంపాదించాలని చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్‌ ఐడియాలు మీ కోసమే..!

Business Ideas : డబ్బు సంపాదించడం నిజంగా అంత కష్టమా.. అంటే.. కష్టం కాదనే చెప్పవచ్చు. నిజంగా ఆలోచించాలే గానీ నేటి తరుణంలో డబ్బు సంపాదించడం ఎవరికైనా సులభతరమే అని చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే ఓర్పు, కొంత నైపుణ్యం, కొంత ఆలోచన ఉండాలే గానీ అస్సలు పెట్టుబడి లేకుండా, లేదా చాలా చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కూడా డబ్బు సంపాదించవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. ఈ క్రమంలోనే అలా డబ్బు సంపాదించాలనే తపన ఉన్న వారి కోసం కింద పలు బిజినెస్‌ ఐడియాలను అందజేస్తున్నాం.

these Business Ideas you can earn money while at home
Business Ideas

నిజానికి వీటిలో చాలా వరకు పనులకు డబ్బులు అవసరం లేదు. తెలివే పెట్టుబడిగా పనిచేస్తుంది. కొన్నింటికి మాత్రం స్వల్ప మొత్తం డబ్బు పెట్టుబడిగా అవసరం అవుతుంది. అయితే ఏ పని ఎంపిక చేసుకున్నా కొంత కష్టపడితే చాలు, డబ్బు సంపాదన అంత కష్టమేమీ కాదు. మరి ఆ బిజినెస్‌ ఐడియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

భార్యా భర్తలు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటూ వారిద్దరూ పనిచేసే వారు అయితే వారి పిల్లలను చూసుకోవడం కష్టతరమవుతుంది. దీంతో వారికి ఒక్కోసారి క్రచెస్‌ వంటి వాటిలో పిల్లలను వదలడం కూడా ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసం బేబీ సిట్టింగ్‌ సర్వీస్‌లను ఇవ్వవచ్చు. దీంతో వారి ఇండ్లకే వెళ్లి వారి పిల్లలను చూసుకుంటే చాలు. నెల తిరిగే సరికి డబ్బు సంపాదించవచ్చు. ఇందుకు కేవలం సమయం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. డబ్బు అవసరం లేదు. చివరకు డబ్బు సంపాదించవచ్చు.

నేటి తరుణంలో చాలా మంది బ్యూటీ పార్లర్‌ సేవలను ఇండ్ల వద్దే అందిస్తున్నారు. ఇందుకు పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది. మేకప్‌ చేసేందుకు అవసరమైన బ్యుటిషియన్‌ కిట్‌, ఇతరత్రా సామగ్రి ఉంటే చాలు, ఇండ్ల వద్దే బ్యుటిషియన్‌ సేవలను అందించి డబ్బులు సంపాదించవచ్చు.

వంట చేయడంలో ప్రావీణ్యం ఉన్నవారు చిన్నపాటి టిఫిన్లను చేసే టిఫిన్‌ సెంటర్‌ను పెట్టుకుంటే డబ్బులు బాగా సంపాదింవచ్చు. స్వగృహ ఫుడ్స్‌, దోశలు, ఇడ్లీలు తదితర టిఫిన్లను మొబైల్‌ క్యాంటీన్లు లేదా బండ్ల ద్వారా అందిస్తే డబ్బులు బాగా సంపాదించేందుకు వీలుంటుంది. ఇందుకు స్వల్ప మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. లాభాలు మాత్రం బాగానే సంపాదించవచ్చు.

నేటి తరుణంలో చిన్నపాటి పట్టణాలు మొదలుకొని నగరాల్లో పెట్‌ కేర్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ఊళ్లకు వెళ్లేవారు తమ పెంపుడు జంతువులను ఈ సెంటర్‌లలో వదులుతారు. దీంతో వారికి తమ పెట్స్‌ పట్ల భయం ఉండదు. నిర్భయంగా ఊళ్లకు వెళ్లి రావచ్చు. అలాంటి వారికి పెట్‌ కేర్‌ సెంటర్ల ద్వారా సేవలు అందించవచ్చు. అలాగే పెంపుడు జంతువులకు అవసరం అయ్యే ఆహార సామగ్రి, మందులను విక్రయించి కూడా లాభాలను గడించవచ్చు.

నేటి తరుణంలో నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఊబర్‌, ఓలా వంటి ట్యాక్సీ సేవలు విస్తృతమవుతున్నాయి. ఎవరైనా కారును కొనుగోలు చేసి దాన్ని ట్యాక్సీగా తిప్పుకున్నా చాలు, లాభాలను ఆర్జించవచ్చు. పిల్లలకు చదువు చెప్పేంత ఓపిక, సామర్థ్యం ఉంటే ఎవరైనా ఇండ్లలోనే ట్యూషన్స్‌ ఓపెన్‌ చేయవచ్చు. దీంతో నెల తిరిగే సరికి ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించవచ్చు. వంట చేయడం బాగా వచ్చి ఉంటే ఆయా వంటలను ఎలా చేయాలో నేర్పించే వీడియోలు తీసి వాటిని యూట్యూబ్‌లో పెట్టినా చాలు. దీంతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇలా చేసేందుకు పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఉండదు.

డ్యాన్స్‌, ఎరోబిక్స్‌, యోగా వంటి అంశాల్లో నిపుణులుగా ఉన్నవారు తమ తమ ఇండ్ల వద్దే ఈ సేవలను అందించవచ్చు. అందుకు పెట్టుబడి కూడా అవసరం ఉండదు. డబ్బులు బాగా ఆర్జించవచ్చు. నేటి తరుణంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎంత ఎక్కువైందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో షాపింగ్‌ చేసేవారికి వారి వారి వస్తువులను వారికి డెలివరీ అందించేందుకు, ఇతరత్రా లెటర్‌లను ఇచ్చేందుకు కొరియర్‌, లాజిస్టిక్స్‌ సేవలకు డిమాండ్‌ ఏర్పడింది. కనుక ఎవరైనా కొరియర్‌, లాజిస్టిక్స్‌ కంపెనీలు, ప్రాంచైజీలను పెడితే ఆయా సేవలను అందించి డబ్బు సంపాదించవచ్చు.

చక్కని కథనాలు రాయడం, వెబ్‌ డిజైనింగ్‌, గ్రాఫిక్ డిజైనింగ్‌ వంటి అంశాల్లో నైపుణ్యం ఉన్నవారు తమ తమ ఇండ్ల వద్దే ఉండి ఫ్రీ లాన్సర్లుగా పనిచేయవచ్చు. ఇలాంటి వారికి నేటి తరుణంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీరు ఫ్రీలాన్సర్స్‌గా పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చు. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడంలో, అకౌంట్స్‌ను నిర్వహించడంలో నైపుణ్యం ఉన్నవారు ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్స్‌గా మారి సేవలను అందించవచ్చు. ఇందుకు పెట్టుబడి కూడా అవసరం లేదు. నైపుణ్యం ఉంటే చాలు, సేవలను అందించవచ్చు. డబ్బును సంపాదించవచ్చు. ఇలా ప‌లు మార్గాల ద్వారా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

Share
Editor

Recent Posts