Beerakaya : బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Beerakaya : బీర‌కాయ.. దీనిని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. బీర‌కాయ‌తో చేసే వంట‌కాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. బీర‌కాయ‌లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. విరివిరిగా ల‌భిస్తాయి క‌నుక వీటిని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ బీర‌కాయ‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ , పీచు ప‌దార్థాలు వంటి పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వారానికి రెండు సార్లు బీర‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో క‌లిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ద్య‌పానం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటున్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.

ఇలా మ‌ద్యం తాగే బీర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం పాడ‌వ‌కుండా ఉంటుంది. కాలేయం ఆరోగ్యం దెబ్బ‌తిన్న వారు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వారానికి రెండు సార్లు బీర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. దీనిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే బీర‌కాయ‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బీర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. విట‌మిన్ సి,ఎ, డి, బి6 ల‌తో పాటుగా ఐర‌న్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ కూడా బీర‌కాయ‌లో ఉంటాయి.

Beerakaya benefits in telugu do not forget to take them
Beerakaya

బీర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌హీనత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బీర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల దీనిలో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. వారానికి రెండు సార్లు బీర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు బీర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వారినికి రెండు సార్లు బీర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణాశ‌యం శుభ్ర‌ప‌డ‌డంతో పాటు జీర్ణ‌క్రియ కూడా మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. మ‌న ఆరోగ్యంతో పాటు అందానికి కూడా బీర‌కాయ ఎంతో మేలు చేస్తుంది.

పోష‌కాహార లోపం వ‌ల్ల వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో పాటు జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి. క‌నుక బీరకాయ‌ను వారినికి రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు అంది చ‌ర్మం మ‌రియు జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. చ‌ర్మం కూడా కాంతివంతంగా త‌యార‌వుతుంది. బీర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దీనిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts