Beetroot For Anemia : మనం ఆహారంగా తీసుకునే దుంపల్లో బీట్ రూట్ ఒకటి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బీట్ రూట్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. బీట్ రూట్ ను కూరగా చేసుకుని తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా దీనిని ఏరూపంలో తీసుకున్నా కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది. అయితే దీనిని కూరగా చేసుకుని తినడం కంటే జ్యూస్ గా చేసుకుని తాగడం వల్లే మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్ రూట్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి… బీట్ రూట్ ను జ్యూస్ ను తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం ఒక బీట్ రూట్ ను తీసుకుని దానిపై ఉండే చెక్కును తీసి వేయాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల బీట్ రూట్ జ్యూస్ తయారవుతుంది. ఈ జ్యూస్ ను గ్లాస్ లోకి తాగాలి. అలాగే దీనిలో రుచి కొరకు తేనెను, నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. బీట్ రూట్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. నీరసంగా ఉన్న వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం తగ్గుతుంది.
ఈ బీట్ రూట్ తో పాటు క్యారెట్ లేదా టమాటాను కలిపి జ్యూస్ గా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ ను ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరంలో ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు తగ్గుతాయి. అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. హార్మోన్ సమస్యలతో బాధపడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ వీటిలో పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ జ్యూస్ ను ఇవ్వవచ్చు. పిల్లలకు ఈ జ్యూస్ ను ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బీట్ రూట్ తో ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని తప్పకుండా ప్రతి ఒక్కరు దీనిని ఆహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.