Pan Cakes : కోడిగుడ్ల‌తో పాన్ కేక్‌ల‌ను ఇలా చేసి తినండి.. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి.. ఎంతో బ‌లం..!

Pan Cakes : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో స‌హ‌జంగానే చాలా మంది ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల‌ను తింటుంటారు. ఇవ‌న్నీ సంప్ర‌దాయ వంట‌కాలు. అయితే ఇవే కాదు.. ఉద‌యాన్నే మ‌నకు అమిత‌మైన బ‌లాన్ని అందించే బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి వాటిల్లో పాన్ కేక్‌లు కూడా ఒక‌టి. వీటిని కోడిగుడ్ల‌తో త‌యారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తిన‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌కాలు కూడా అందుతాయి. ఇక పాన్ కేక్‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ కేక్‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మెత్త‌గా వండిన అన్నం – ఒక క‌ప్పు, గుడ్లు – 3, చ‌క్కెర – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – పావు క‌ప్పు.

Pan Cakes recipe in telugu make in this way very tasty
Pan Cakes

పాన్ కేక్‌ల‌ను త‌యారు చేసే విధానం..

ముందు గుడ్ల సొన‌ను ఒక గిన్నెలో తీసుకుని బాగా గిల‌కొట్టాలి. ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. స్ట‌వ్ పై పెనం పెట్టి అది వేడ‌య్యాక కొంచెం నూనె పోసి వేడి చేయాలి. వేడ‌య్యాక ఈ మిశ్ర‌మాన్ని చిన్న దోశ‌లా వేయాలి. రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చి తీయాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న‌పాటి దోశ‌ల్లా వేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన పాన్ కేక్‌లు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా చ‌ట్నీతోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. రెగ్యుల‌ర్‌గా చేసుకునే ఇడ్లీ, దోశ‌ల‌కు బ‌దులుగా ఇలా ఒక‌సారి పాన్ కేక్‌ల‌ను వేసి తినండి. ఎంతో అద్భుతంగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి.

Editor

Recent Posts