Sweet Potato : చిలగడ దుంపలు.. ఇవి మిగిలిన ఇతర దుంపల్లా కాదు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పచ్చిగా నేరుగా అలాగే తినవచ్చు. కొందరు వీటితో కూర చేసుకుని తింటారు. కొందరు ఉడకబెట్టి తింటారు. అయితే ఎలా తిన్నా సరే చిలగడదుంపలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల మనకు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ బాధించవు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. ఇతర దుంపల్లా ఇవి షుగర్ లెవల్స్‌ను పెంచవు.. తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే సమ్మేళనాలు మధుమేహాన్ని అదుపు చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి చిలగడ దుంపలు వరమనే చెప్పవచ్చు.
చిలగడదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. బీపీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు ఉన్నవారు చిలగడ దుంపలను తింటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. అలాగే మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ఈ దుంపల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది.
చిలగడ దుంపలు తినడం వల్ల చర్మ సమస్యలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యవ్వనంగా కనిపిస్తారు. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి చిలగడ దుంపలకు ఉంది. కనుక వీటిని తింటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వీటిలో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. ఈ దుంపల్లో ఉండే ఫైబర్ వల్ల అల్సర్లు నయమవుతాయి. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుంది. ఈ దుంపల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా చిలగడ దుంపలను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజుకు ఒక దుంపను తిన్నా చాలు.. ఎంతో మేలు జరుగుతుంది.