Sapota : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో సపోటాలు ఒకటి. ఇవి చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. కనుక వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటుంటారు. అయితే సపోటాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక ఈ పండును తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే విరేచనాలు కూడా తగ్గుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
సపోటా పండ్లలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. సపోటా పండ్లలో యాంటీ పారాసైటిక్ గుణాలు ఉంటాయి. దీని వల్ల ఈ పండ్లను తింటే జీర్ణవ్యవస్థలో ఉండే పురుగులు, సూక్ష్మ క్రిములు అన్నీ నశిస్తాయి. దీంతో వాటి వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక ఈ పండ్లలో ఉండే పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీనివల్ల హైబీపీ తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
సపోటాల్లో ఐరన్ కూడా పుష్కలంగానే ఉంటుంది. కనుక దీన్ని తింటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు ఈ పండ్లలో కాపర్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను రాకుండా చూస్తాయి. అలాగే గాఢ నిద్ర పట్టేలా చేస్తాయి. నిద్రలేమి నుంచి బయట పడేస్తాయి. సపోటాలను తినడం వల్ల శక్తి బాగా లభిస్తుంది. బాగా అలసిపోయిన వారు, నీరసంగా ఉండేవారు, శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసే వారు ఈ పండ్లను తింటే వెంటనే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారిపోతారు. చురుగ్గా పనిచేస్తారు.
సపోటా పండ్లలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. మన శరీరంలో హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలు రావు. అలాగే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టుకు కూడా సపోటాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. దీంతో జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. సపోటాల్లో ఉండే కాల్షియం మన శరీరంలోని ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పండ్లను తింటే అటు తల్లికి.. ఇటు బిడ్డకు ఎంతో మేలు జరుగుతుంది. పోషకాలు లభిస్తాయి. దీంతో శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా సపోటాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.