Sweet Potato : చిలగడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఇతర దుంపల్లా ఉడకబెట్టాల్సిన పనిలేదు. నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో చిలగడ దుంపను కచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. చిలగడ దుంపలను రోజూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చిలగడదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఈ దుంపను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఇతర ఆహారాల వైపుకు యావ పోదు. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ దుంపల్లోని ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
2. చిలగడదుంపల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటి వల్ల రక్తం పెరగడమే కాదు.. ఎముకలు బలంగా తయారవుతాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
3. చిలగడదుంపల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీని వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
4. ఈ దుంపల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే సమ్మేళనాలు ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటే క్యాన్సర్‌లు రాకుండా చూసుకోవచ్చు.
5. ఈ దుంపల్లో విటమిన్ ఎ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరిచి కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ దుంపలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి దుంపలే అయినప్పటికీ షుగర్ ఉన్నవారికి వరం అని చెప్పవచ్చు. ఇతర దుంపల మాదిరిగా కాదు. వీటిని తిన్నాక రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. పైగా తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు వీటిని తప్పకుండా రోజూ తినాలి.
6. ఈ దుంపల్లో ఉండే మెగ్నిషియం ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గిస్తుంది. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
7. ఆస్తమా, కీళ్ల నొప్పులు, వాపులు, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వంటి ఎన్నో సమస్యలు ఉన్నవారికి ఈ దుంపలు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజూ ఆహారంలో తీసుకోవాలి. రోజుకు ఒక మీడియం సైజ్ చిలగడదుంపను తిన్నా చాలు.. అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.