Off Beat

ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లాక చేతుల్తో కడుక్కుంటారు… ఛీ..ఛీ.. అన్న విదేశీయుడికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు ఓ ఇండియన్‌..!

మన భారతీయులంటే విదేశీయులకు ఎప్పటికీ చులకనే. మనం చేసే అనేక పనులను వారు హేళన చేస్తారు. మనల్ని చిన్నచూపు చూస్తారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో భారతీయుల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు నీచంగా చేతులను ఎందుకు వాడుతారు ? పేపర్‌ టవల్స్‌ వాడితే సరిపోతుంది కదా ? డైరెక్ట్‌గా చేతులతో కడుక్కోవడం.. యాక్‌.. అసహ్యంగా ఉంటుంది. అని కామెంట్‌ చేశాడు. అయితే దీనికి ఓ వ్యక్తి (భారతీయుడు) చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అతను ఇచ్చిన కౌంటర్ అతని మాటల్లోనే…

మా భారతీయులు టాయిలెట్స్‌కు వెళ్లాక చేతుల్తోనే ఎందుకు కడుగుతారు, టాయిలెట్‌ పేపర్‌ ఎందుకు వాడరు ? అని కదా మీరు అన్నది. అయితే అది ఎందుకో తెలియాలంటే.. ముందు మీరు ఇలా చేయండి…

an indian answer to foreigner who insults

మీ ఇంట్లో ఒక ప్లేట్‌ తీసుకోండి. అందులో చక్కని కర్రీని నిండుగా వడ్డించుకుని తినండి. అనంతరం ఆ ప్లేట్‌ను నీటితో కడగకండి. మీరు అంటున్నారే.. అదే పేపర్‌ టవల్‌తో శుభ్రంగా తుడవండి. శుభ్రంగా అంటే.. ప్లేట్‌ లో ఆహార పదార్థం ఏమీ లేకుండా నీట్‌గా తుడవండి. ఆ తరువాత ప్లేట్‌ను అలాగే పెట్టండి. 10 నుంచి 12 గంటల తరువాత ఆ ప్లేట్‌ను మళ్లీ తీయండి. అప్పుడు మళ్లీ ఏదైనా ఆహారాన్ని వడ్డించుకుని తినండి… ఏంటీ.. అర్థమవుతుందా..? అలా చేయండి… ఏంటీ చేయలేరా..! ఎందుకు చేయలేరు, మీరు పేపర్‌ టవల్‌ తో శుభ్రంగా తుడిచారు కదా, మరలాంటప్పుడు అది శుభ్రంగానే ఉంటుంది, మరి ఎందుకు అందులో తినరు ? బాక్టీరియా ఉంటుందని కదా.. అవును, మేం చెబుతున్నది కూడా అదే. పేపర్‌ టవల్‌ను వాడితే బాక్టీరియా పోదు, అలాగే ఉంటుంది. అదే నీటిని వాడితే శుభ్రంగా క్లీన్‌ చేయవచ్చు. అది ప్లేట్‌ అయినా సరే… మన శరీరంలో ఏదైనా పార్ట్‌ అయినా సరే.. నీటి వల్లే క్లీన్‌ అవుతుంది, పేపర్‌ టవల్‌ వల్ల కాదు..

ఈ సమాధానం ఇచ్చే సరికి ఆ విదేశీయుడు షాక్‌..! అవును, మరి తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు. అలా ఒక దేశాన్ని ఎగతాళి చేసి మాట్లాడితే అంతే శాస్తి జరుగుతుంది..!

Admin

Recent Posts