అంటార్కిటికాలోని రక్త జలపాతం గుట్టువిప్పారు సైంటిస్టులు. వందేళ్లుగా అంతుచిక్కని రహస్యంగా ఉన్న దీన్ని రహస్యాన్ని ఛేదించారు. మంచు కొండల మధ్య ఎర్ర రంగులో ప్రవహిస్తున్న జలపాతం సీక్రెట్ తెలుసుకున్నారు వర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ శాస్త్రవేత్తలు. తూర్పు అంటార్కిటికాలోని ఈ ‘రక్త జలపాతాన్ని’ 1911లో గుర్తించారు. ఈ జలపాతం నీటిలోని ఇనుము గాలితో కలసినపుడు నీటి రంగు ఎరుపులోకి మారుతోందని, తద్వారా ఎరుపు రంగులో జలం ప్రవహిస్తోందని తమ పరిశోధనలో తేలిందని యూఏఎఫ్‌కు చెందిన క్రిస్టినా తెలిపారు.
నీటిలో మితిమీరిన ఉప్పుతోపాటు ఐరన్ పాళ్లు కూడా ఎక్కువగా ఉండడంవల్లే ఈ రక్త జలపాతం ఏర్పడుతోందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆధారాలను వారు సేకరించారు. అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ కింద దాదాపు పది లక్షల సంవత్సరాల నుంచి ఉప్పు నీరు చిక్కుబడిపోయి ఉంది. రేడియో ఎకో సౌండింగ్ పరీక్ష ద్వారా శాస్త్రవేత్తలు ఈ నీటి జాడలను కనుగొన్నారు. మంచుదిబ్బల లోపల నీరు ప్రవహిస్తుందనేది నమ్మశక్యంకాని విషయం.
అయితే నీరు గడ్డకట్టే ప్రక్రియలోనే దీనికి జవాబు ఉందని వారు చెబుతున్నారు. నీరు మంచుగా మారేముందు ఉష్ణాన్ని బయటికి వెదజల్లుతుంది. దీంతో పక్కన ఉన్న మంచుకరిగి ప్రవాహాలు ఏర్పడతాయన్నారు.