Off Beat

రెస్టారెంట్‌కు వ‌చ్చిన ధ‌నికుడి క‌ళ్లు తెరిపించిన బేర‌ర్‌.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఏరియాలో మంచి పేరున్న రెస్టారెంట్ అది&period; ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ వుంటుంది&period; వారాంతాలలో అయితే చాలా రద్దీగా వుంటుంది&period; డబ్బున్న శ్రీమంతులు పెద్దపెద్ద కార్లలో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి రకరకాల రుచులను ఆస్వాదించి వెళ్తుంటారు&period; అలాంటి వారిలో ఒక శ్రీమంతుడు ప్రతివారం తన కుటుంబంతో అక్కడికి వస్తుంటాడు&period; అతను వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో బేరర్ టిప్ ఇస్తుంటాడు&period; అందుకే అతనికి సర్వ్ చేసే అవకాశంకోసం బేరర్ లు ఎదురుచూస్తుంటారు&period; అలాట్‌మెంట్ సిస్టం వుండటం వలన ఒక్కొక్క వారం ఒక్కొక్కర్ని ఆ అదృష్టం వరిస్తుంది&period; ఒక వారాంతంలో అతను ఎప్పటిలాగే కుటుంబసమేతంగా హోటల్ కి విచ్చేశాడు&period; ఆ శ్రీమంతుడికి సర్వ్ చేసే అవకాశం వచ్చిన కుర్రాడు ఆరోజు సెలవు పెట్టాడు&period; అందుచేత ఆ డ్యూటీ కొత్తగా వచ్చిన హనుమంతుకి పడింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల క్రితమే పనిలో చేరి&comma; ఆరోజే మొదటి జీతం అందుకున్న హనుమంతుకి ఈ అవకాశం మరింత సంతోషాన్నిచ్చింది&period; తోటివారందరూ అతని అదృష్టానికి కొంచెం అసూయపడ్డారు&period; శ్రీమంతుడికి&comma; అతని ఫ్యామిలీకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వ్ చేశాడు హనుమంతు&period; ఆరోజు హోటల్ లో వున్న స్పెషల్ ఐటెమ్స్ గురించి చెప్పి&comma; ఏ పదార్ధాలు ఎలాంటి ప్రత్యేకమైన రుచికోసం తయారు చెయ్యబడ్డవో పూస గుచ్చినట్టు వివరించాడు&period; అతని పనితనానికి శ్రీమంతుడు చాలా ముచ్చటపడ్డాడు&period; అతను చెప్పిన స్పెషల్ ఐటెమ్స్ ని తెప్పించుకున్నాడు&period; కానీ ఆర్డర్ ఇచ్చిన ఏ ఐటెమ్ ని సగం కూడా తినలేదు&period; ఒక్కొక్క ఐటెమ్ ని ప్లేట్ లో వడ్దించుకోవడం&comma; కొంచెం తినడం&comma; టిష్యూ పేపర్ తో మూతి తుడుచుకుని ఆ మిగిలిన ఆహారపదార్ధంలో పడెయ్యడం&period; మళ్ళీ ఇంకో ప్లేట్ తీస్కోవడం… మళ్ళీమళ్ళీ అదే తంతు&period; ఇంచుమించు ఫ్యామిలీ అందరూ అదే పద్దతిలో తమ తమ భోజనాలను ముగించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82753 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;restaurant&period;jpg" alt&equals;"bearer made wealthy person know his mistake " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ హొటల్ లో పనికి కుదిరినప్పట్నించి ఇప్పటి వరకూ ఇలాంటి కస్టమర్స్ ని హనుమంతు చూడలేదు&period; వాళ్ళు ఆహారపదార్ధాలను వృధా చేస్తున్న పద్దతి చూసి మనసులో కలతచెందాడు&period; కస్టమర్ తనకు కావలసింది ఆర్డర్ ఇస్తాడు&period; ఆర్డర్ ఇచ్చిన దానికి డబ్బులు కడతాడు&period; కాబట్టి వృధాలాంటి విషయాలలో కస్టమర్ ని ప్రశ్నించే హక్కు మనకు వుండదు &&num;8211&semi; ఇది రెస్టారెంట్లో పనికి కుదిరిన మొదటిరోజు చెప్పిన రూల్&period; అందుకే ఏమీ అనలేక మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు హనుమంతు&period; శ్రీమంతుడు బిల్ పే చేసిన తర్వాత పర్స్ లో వున్న కొన్ని కరెన్సీ నోట్లు తీసి మెనూ బుక్ లో పెట్టి లేచి వెళ్ళిపోయాడు&period; ఎంత టిప్పు ఇచ్చుంటాడో&period;&period; అని మిగిలిన బేరర్స్ అందరూ అనుకుంటుండగా&comma; హనుమంతు మెనూ బుక్ లో వున్న డబ్బులు తీస్కుని బయటకు పరుగెత్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీమంతుని కారు దగ్గరికి వచ్చిన హనుమంతుని చూసి… ఏంటయ్యా&excl; టిప్ సరిపోలేదా&quest; లేదు సార్&excl; నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు హనుమంతు&period; చెప్పమన్నట్టుగా చూశాడు&period; టిప్ పేరుతో అతనిచ్చిన కరెన్సీ నోట్లకు మరికొన్ని నోట్లను జతచేసి ఇస్తూ&period;&period; మీరిచ్చిన డబ్బులకు నా నెల జీతం కూడా కలిపి మీకు ఇస్తాను సార్&comma; మీరు తినకుండా వృధా చేసినంత ఆహారాన్ని ఎన్ని రోజుల్లో కష్టపడి పండించి తీసుకురాగలరో చెప్పండి అన్నాడు&period; ఊహించని ప్రశ్నకు శ్రీమంతుడు షాక్ అయ్యాడు&period; డబ్బులు అందరూ సంపాదిస్తారు సార్&period; కానీ సంపాదించేవాళ్ళందరి డబ్బూ కలిపినా ఒక్కడి ఆకలి తీరదు సార్&period; పంచభూతాలతో పోరాటం చేసి పుట్టిన మెతుకుని పచ్చనోట్లు చూస్కుని వృధా చెయ్యొద్దు సార్ చేతులు జోడించి అభ్యర్దించాడు&period; ఆ అభ్యర్ధనకు తన దగ్గర సమాధానం లేదని తెలుసుకుని సిగ్గుపడ్డాడు శ్రీమంతుడు&period; హనుమంతులో తన అజ్ణానాన్ని పోగొట్టడానికొచ్చిన అతిధి కనిపించాడతనికి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts