Off Beat

విమానానికి రెడ్, గ్రీన్ లైట్స్ ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి..?

సాధారణంగా రాత్రి వేళలో ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడప్పుడు విమానాలు గ్రీన్ మరియు రెడ్ కలర్ లైట్ లు మెరుస్తూ ఉంటాయి. దీన్ని మనం ఇదివరకు గమనించే ఉంటాం. ఒక రెక్కకు రెడ్ కలర్, మరో రెక్కకు గ్రీన్ కలర్ లైట్లు ఉంటాయి. అసలు ఈ రంగులనే ఎందుకు వాడతారో ఓసారి చూద్దాం. ప్రతి ఒక్క విమానానికి ఎడమవైపు రెక్కకు ఎరుపు రంగు, కుడివైపు రెక్కకు ఆకుపచ్చ రంగు లైట్లు ఉంటాయి. అలాగే విమానం వెనుక భాగంలో తెలుపు రంగు లైట్ ఉంటుంది.

కింది నుంచి చూసే వారికి ఇది కనిపించదు. ఇవి రాత్రి సమయంలో మనకు క్లియర్ గా కనిపిస్తాయి. వీటిని నేవిగేషన్ లైట్స్ అంటారు. ఈ లైట్ల ప్రధాన ఉద్దేశం విమానం యొక్క ఉనికిని తెలియ జేయడం. దీనివల్ల పైలెట్ ఆకాశంలో వెళ్లేటప్పుడు మరో విమానాన్ని ఈజీగా కనిపెట్టగలగుతారు. రాత్రి పూట ఆ విమానం ఏ దిశలో వెళ్తుందో పైలెట్ అర్థం చేసుకునేందుకు కూడా ఈ లైట్లు చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు రాత్రివేళ రెండు విమానాలు కొద్ది కొద్ది దూరంలో ప్రయాణిస్తున్నాయి అనుకుందాం.

do you know why aeroplanes have red and green lights

ఒకదానికి ఒకటి ఢీ కొనకుండా నియంత్రించాలంటే ఆ విమానం ఏ దిశలో వెళ్తుందో పైలెట్ కు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అయితే విమానం ఏ దిశలో వెళ్తుందో మెరుస్తూ ఉండే రెడ్, గ్రీన్, వైట్ లైట్ లే తెలియజేస్తాయి. పైలెట్ కు మరో విమానం యొక్క వైట్, రెడ్ లైట్ లు కనిపిస్తే అది అతనికి కుడి నుండి ఎడమ వైపుకు వెళ్తుంది అని అర్థం. అదే గ్రీన్, వైట్ కనిపిస్తే అది ఎడమ నుంచి కుడి వైపు వెళ్తుంది అని అర్థం. ఒకవేళ పైలట్ కు గ్రీన్, రెడ్ 2 కనిపిస్తే ఆ విమానం తాను వెళ్తున్న దిశలోనే వెళ్తుంది అని అర్థం. ఇక గ్రీన్, రెడ్, వైట్ కలర్ కనిపిస్తే ఆ విమానం తనకు ఎదురుగా వస్తుంది అని అర్థం.

Admin

Recent Posts