ముఖేష్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన గురించి అందరికీ తెలుసు. పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలోని ముఖేష్ అంబానీ ఇల్లే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇక కొన్ని వేల కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టే కంపెనీలు ఈయనకు ఉన్నాయి. వాటిల్లో జియో కూడా ఒకటి. అయితే మీకు తెలుసా..? ముఖేష్ అంబానీకి ఎన్ని కార్లు ఉన్నాయో ? 500 కార్లు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాలా 500 కార్లు ఈయనకు ఉన్నాయి. ఇక మరి ముఖేష్ అంబానీ తిరిగే కారు డ్రైవర్‌కు జీతం ఎంత ఉంటుందో తెలుసా ?
అక్షరాలా రూ.2 లక్షలకు పైమాటే. ఏంటీ.. అవాక్కయ్యారా ? అవును, మరి. కారు డ్రైవర్‌కే రూ.2 లక్షలు అంటే మాటలు కాదు కదా. కానీ మీరు విన్నది నిజమే. ముఖేష్ అంబానీ తిరిగే కారు డ్రైవర్ జీతం రూ.2 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఆ పోస్టులోకి వెళ్లాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే… ముఖేష్ అంబానీ కారు నడపాలంటే.. డ్రైవర్లు చాలా శిక్షితులై ఉండాలి.
సాధారణంగా ముఖేష్ అంబానీ తన కార్లకు డ్రైవర్లు కావాలనుకుంటే ముందుగా పలు కాంట్రాక్టు కంపెనీలను పిలుస్తారు. వారు కొందరు డ్రైవర్లను ఎంపిక చేసి వారికి బాగా శిక్షణిస్తారు. ఎలా అంటే… ఎటువంటి పరిస్థితుల్లో కారు ఎలా డ్రైవ్ చేయాలి ? అనే అంశాలపై శ్రద్ధగా శిక్షణనిస్తారు. ఇక ఆ శిక్షణలో పాస్ అయిన వారినే ముఖేష్ అంబానీ వద్దకు పంపుతారు. అలా అంబానీ వద్దకు వెళ్లిన వారే డ్రైవర్ అవుతారు. వారికి ప్రారంభంలోనే రూ.2 లక్షలకు పైగా జీతం ఉంటుంది. ఇక పండుగలు వచ్చాయంటే బోనస్‌లు సరే సరి. అలా ఉంటుంది ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ లైఫ్. ఏంటీ.. మీకు కూడా అలా అయిపోతే బాగుండనిపిస్తుందా ? అది సహజమే. కానీ అందుకు తగిన రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే.. ఆ కార్లు ఆషామాషీ కార్లు కావు. చాలా ఖరీదైనవి మరి..! వాటిని నడపాలంటే ఆ మాత్రం జీతం ఉండాల్సిందే కదా..!