హాస్పటల్స్ లో ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపురంగు బల్బు వెలిగిస్తారు.మనం హాస్పటల్ కి వెళ్లినప్పుడు అది వెలగడం చూసే ఉంటాం..కానీ ఈ ఎరుపు రంగు బల్బే ఎందుకు ఏ నీలమో,మరే రంగు బల్బైనా వెలిగించొచ్చు కదా అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపు రంగు బల్బు వెలగడం వెనుక పెద్ద కథే ఉండందోయ్..అది తెలుసుకోవాలంటే మనం అనగనగా అనుకుంటూ ఈజిప్షియన్స్ చరిత్రలోకి వెళ్లిపోవాలి…
అప్పట్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడం కత్తిమీద సాములా ఉండేది.సమావేశాల్ని రహస్యంగా నిర్వహించేవారు బయట సెక్యురిటీ గార్డులను పెట్టడానికి కూడా భయపడేవారు..ఎందుకంటే ఆ సెక్యురిటీ గార్డు ద్వారా తమ రహస్య సమావేశాల వివరాలు బయటికి పొక్కితే రాజ్యాధికార రూపురేఖలే మారే ప్రమాదముండేది..దీనికి పరిష్కారంగా ఒక అద్బుతమైన ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు..సమావేశం జరుగుతున్న గదిబయట గులాభి పూవును వేలాడదీయడం అనే సంకేతంతో సమావేశాలు జరిపేవారు..గులాభి వేలాడదీసిన ప్రాంతం చుట్టుపక్కల ఎవరైన సంచరిస్తే వారిని ద్రోహులుగా ప్రకటించి కఠినాతి కఠినంగా శిక్షించేవారు…లోపల జరిగిన సమావేశాలు అత్యంత రహస్యంగా పరిగణించేవారు.. ఇలా పాపులర్ అయినా ఈ ట్రెండ్ ను హాస్పిటాల్స్ వారు సొంతం చేసుకున్నారు..
అదేవిధంగా అప్పట్లో సైంటిఫిక్ కమ్యునిటీ,ఆనాటి చర్చ్ వారితో దాదాపు యుద్దమే చేసేది.ఎవరికైనా చికిత్సలో భాగంగా వారి శరీరాన్ని కోయాల్సిన పరిస్థితి వస్తే చర్చ్ వారి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చేది..చర్చ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంధర్బాలలో ఇలాంటి ఆఫరేషన్లను నిర్వహించే గది బయట కూడా ఎర్రగులాభిని వేలాడదీసి,రహస్యంగా చేసేవారు..ఆఫరేషన్ తర్వాత పేషెంట్ కోలుకునే వరకు బయట ఎరుపు గులాబి వేలాడుతూనే ఉండేది..దీనికి అర్దం డు నాట్ డిస్టర్బ్.. కాలక్రమంలో ఈ గులాబి పువ్వే ఎరుపు లైట్ గా రూపాంతరం చెందింది… ఆపరేషన్ థియేటర్ బయట వెలిగే ఎర్రలైట్ వెనుక కథ ఇది..