అప్పుడు నాకు 13 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో నాకు మొటిమలు బాగా వచ్చాయి. దీంతో నా తల్లిదండ్రులు నన్ను ఓ డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. కొంత సేపు వేచి ఉన్నాక నర్సు పిలిస్తే డాక్టర్ రూంలోకి వెళ్లాం. పక్కనే అమ్మా, నాన్న కూర్చున్నారు. నేను డాక్టర్ దగ్గరే ఉన్నా. అతను నన్ను పరీక్షించాడు. టార్చి లైట్ వేసి మొటిమలను, నాలుకను చూశాడు. అతను బాగా యంగ్ డాక్టర్‌లా ఉన్నాడు. చూస్తే 25 సంవత్సరాల వయస్సు లోపే ఉంటాడు. అప్పుడే అతను ఓ షాకింగ్ ప్రశ్న వేశాడు. నువ్వు రోజూ పోర్న్ (అశ్లీల) వీడియోలు చూస్తావా అని అడిగాడు.
డాక్టర్ అలా అడిగేసరికి నాకు షాక్ కొట్టినంత పనైంది. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పక్కనే అమ్మానాన్న ఉన్నారు. ఇతనేంటి, నన్ను ఇలాంటి ప్రశ్న అడిగాడు. సరే.. పోర్న్ చూస్తాం. అందులో తప్పేముంది ? అందుకు ఆ ప్రశ్న నాకు వేయాలా ? తదితర ప్రశ్నలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. వాటిని పటాపంచలు చేస్తూ ఒక్కసారిగా నో అని చెప్పా. అందుకు అతను మాట్లాడుతూ.. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పోర్న్‌చూసే వాన్ని. అలా చూస్తూ మా నాన్నకు ఒకరోజు దొరికా. అప్పుడు నాకు కూడా ఇలాగే మొటిమలు వచ్చేవి. అందుకే నువ్వు కూడా పోర్న్ వీడియోలు చూస్తావా ? అని అడిగా. తప్పుగా అనుకోవద్దు. అని అతను అన్నాడు.
తరువాత మళ్లీ నన్ను అతను టెస్ట్ చేశాడు. అయితే నిజానికి నేను పోర్న్ వీడియోలు చూస్తా. కానీ ఆ విషయం అతనికెందుకు. అది నా పర్సనల్ మ్యాటర్. కొంచెం ఉంటే నా పేరెంట్స్ మా ఇంట్లో నెట్ కనెక్షన్‌ను కట్ చేయించే వారు. అలా జరగనందుకు నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకున్నా. అయినా రోజూ పోర్న్ వీడియోలు చూస్తే మొటిమలు వస్తాయా ? హార్మోన్లు దెబ్బతింటాయా ? అది నాన్సెన్స్ అనిపించింది. ఆ డాక్టర్ కావాలనే నన్ను అలా అడిగాడని అనిపించింది. తరువాత టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. నా చర్మం ఆయిల్ స్కిన్ అవడం వల్ల ఆయిల్ చర్మంపై ఎక్కువగా స్రవిస్తూ అలా మొటిమలు వస్తున్నాయని తేల్చారు. దీంతో నాకు నేనే మరోసారి థాంక్స్ చెప్పుకున్నా. ఆ రోజు జరిగిన ఈ సంఘటన ఇంకా నాకు గుర్తుంది. అయినా పోర్న్ వీడియోలు చూస్తే మొటిమలు వస్తాయనే విషయం నిజంగా నమ్మబుద్ది కావడం లేదు. ఇప్పటికీ..! అది వట్టిదేనని నా ఫీలింగ్..!