Off Beat

రాత్రిపూట మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు ఇది తెలుసుకోవాల్సిందే..?

సాధారణంగా ఆడపిల్లలు తలలో మల్లెపూలు పెట్టుకుంటారు. ఆ మల్లెపూలకు మత్తు ఎక్కువగా ఉంటుంది అంటారు. మల్లెపూలు అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి రొమాంటిక్ సీన్లు మాత్రమే. ఈవిధంగా పూర్వకాలంలో ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకునేవారు. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మల్లెపూల అంటే ఓన్లీ పడకగదిలోకి మాత్రమే పరిమితమయ్యాయి. లేదంటే ఏదైనా పండగలు లేదంటే పెళ్లిళ్లకు మాత్రమే ఆడపిల్లలు పెట్టుకుంటున్నారు. మల్లెపూలు పెట్టుకున్నా చాలామంది బెడ్ రూమ్ లో మాత్రమే పెట్టుకుని ఆ తర్వాత పడేస్తూ ఉంటారు. పూర్వ కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు అంతా మల్లెపూలు ప్రతిరోజు పెట్టుకునేవారు.

ఆ కాలంలో ప్రతి వీధికి ఒక మల్లెచెట్టు ఉండేది. ఆ మల్లె పూలు తెంపుకొని ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో బొట్టు పెట్టుకున్న పూలు పెట్టుకున్న ఓల్డ్ ఫ్యాషన్ కింద జమకట్టి అదో విధంగా చూస్తున్నారు. కానీ మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఒక సైన్సు దాగి ఉందనే విషయాన్ని అందరూ మరుస్తున్నారు. మల్లెపూలు రొమాంటిక్ ఆలోచనలు తీసుకురావడమే కాకుండా, గాలిని తాజాగా అందించడంలో ఉపయోగపడతాయి. మల్లెపూల వాసన కి క్రిమికీటకాలు కూడా మన దరిచేరవు. చెడు వాసన ని డామినేట్ చేసి మనకు మంచి వాసనను ఇస్తాయి.

the reason why women must wear jasmine flowers

ప్రస్తుత కాలంలో ఎయిర్ ప్రెషర్ ని వాడి కంపు ని పోగొట్టుకుంటున్నారు. పూర్వకాలంలో మల్లెపూలు ఇంట్లో పెట్టుకొని ఆడవారు తిరుగుతూ ఉంటే మంచి వాసనే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉపయోగపడేది. మల్లెపూల లో ఉండే రసాయనాలు జుట్టుకు అంటుకొని అవి రాలకుండా ఉపయోగపడతాయి. మల్లెపూల వల్ల వెంట్రుకలు తెల్లబడటం కానీ తలపోటు వంటివి గాని రావు. అందుకే పూర్వకాలంలో చిన్నప్పటినుంచి పూలని పెట్టడం అలవాటు చేశారు. కాలక్రమేణా ఈ మల్లెపూలను పక్కనపెట్టి లేనిపోని రసాయనాలు ముఖానికి రాసుకుని అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం.

Admin

Recent Posts