ఆధ్యాత్మికం

చిలుకూరి బాలాజీ ని “VISA” దేవుడు అని ఎందుకు పిలుస్తారు ?

హుండీ అనేది కంపల్సరిగా ప్రతి టెంపుల్లో ఉంటుంది. కానీ, ఈ ఆలయం మాత్రం అలా కాదు. ఇక్కడ హుండీ లేకపోవడమే వెరీ స్పెషల్, ఈ ఆలయం ఎక్కడుందంటే, తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చేరువలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది ఆ టెంపుల్. అలా ఆ టెంపుల్ కు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ ఆలయం వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండటం విశేషం.

ప్రతిరోజు ఇక్కడికి దేవుడి సందర్శనార్థం సుమారు 30 వేల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఇక హాలిడేస్ లో అయితే ఏకంగా 50,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు ఇకపోతే ఈ ఆలయంలో విఐపి దర్శనాలు, టికెట్లు ఉండవు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కు ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి తో పాటు మహా శివుడు కూడా పూజలు అందుకుంటాడు. ఇది ఈ ఆలయ విశిష్టతని స్థానికులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల వెలిశాడు. అందులో ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్ కాగా, దీనిని తెలంగాణ తిరుమల అని పిలుస్తుంటారు.

do you know why chilukuru balaji called visa god

తెలంగాణ తిరుమల టెంపుల్ గా చిలుకూరు బాలాజీ బాగా ఫేమస్ అయ్యారు కూడా. ఈ చిలుకూరు బాలాజీ ఆలయానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామి చిలుకూరు ఆలయంలో ఉంటాడు. కలియుగ దైవమైన బాలాజీకి ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే చాలు, కోరికలు నెరవేరుతాయి. భక్తులు ప్రతి రోజు వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఈ బాలాజీకి వీసా గాడ్ అని మరో పేరు కూడా ఉంది. చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థులు వీసా కోసం ఇక్కడకు వచ్చి మొక్కుకున్న తర్వాత వీసాలు వచ్చాయట. అవి బాలాజీ వీసా గాడ్ అయిపోయాడు. వీసాలు మంజూరు చేసే దేవుడిగా చిలుకూరు బాలాజీ కి మంచి పేరు ఉంది.

Admin