ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తుంది. అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే.. ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ ఇస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు.
అక్కఅక్క.. అర్జెంట్‌గా ఫోన్ చేస్కోవాలి.. నా ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు.. ఓసారి నీ ఫోనిస్తవా అంటే.. అయ్యో పాపమని నమ్మి ఫోనిచ్చింది ఆమె. వాడు ఫోన్ నెంబరు కొట్టినట్టు.. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చాడు. సరే వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అని ఆ పెట్రోలు బంక్ అమ్మాయి వచ్చిన కస్టమర్స్‌కి పెట్రోలు కొడుతోంది.
ఇదే అదనుగా ఫోను మాట్లాడినట్టు పక్కకు పోయి అటు నుంచి అటే జంప్ అయ్యాడు కేటుగాడు. దీంతో ఆమె లబోదిబోమంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కనుక మీ దగ్గరకు కూడా ఎవరైనా ఇలా ఫోన్ చేసుకుంటామని వస్తే అసలు నమ్మకండి. వారు మరీ అంతగా బతిమిలాడితే ఫోన్ ఇవ్వకండి. కానీ మీరే వారు చెప్పే నంబర్‌కు డయల్ చేసి మాట్లాడండి. వారు చెప్పే సమాచారాన్ని ఫోన్‌లో ఉన్న వ్యక్తులకు చేరవేయండి. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడించండి. కానీ ఫోన్ చేసుకుంటామని, ఫోన్ ఇవ్వమని మీ దగ్గరకు వస్తే ఎవరినీ అంత సులభంగా నమ్మి మోసపోకండి.