Off Beat

సైనికుడు సెలవునుండి రాకపోతే ఏమిజరుగుతుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు కార్గిల్ యుద్ధములో షహీద్ అయిన సైనికుడి మృతదేహాన్ని ఆగ్రా నుండి వారి గ్రామానికి చేర్చాలని అందుకు ముందుగా రూట్ మ్యాప్ తయారు చేయమని ఆదేశాలు అందాయి&period; ఆ సైనికుడి డాకుమెంట్స్ ద్వారా గ్రామము&comma; తాలూకా&comma; జిల్లా పరిశీలించా&excl; ఆశ్చర్యము అతని పర్సనల్ డాక్యుమెంట్ లో అన్నీ ఒకే వివరాలు ఉన్నాయి&period; బటాలిన్ ద్వారా ఆ సైనికుడి గ్రామము&comma; అతని దగ్గర గ్రామాల ఉన్న సైనికుల ద్వారా సరైన వివరాలు పొందాను&period; ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్ లేదు&comma; సర్వే మ్యాప్ మిలిటరీ ది మఱియు పెద్ద స్కేల్ ఉన్న పోలీస్ శాఖ వద్ద ఉన్న మ్యాప్ సహాయముతో ఆ సైనికుడి గ్రామాన్ని గుర్తించి ఆగ్రా నుండి వారి గ్రామానికి మిలిటరీ వెహికల్ ఊరేగింపుగా తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు సిద్దము చేసాము&period; మొత్తము మూడు వాహనాలు ఒక దాంట్లో మృతదేహము&comma; రెండవ దాంట్లో మిలిటరీ బ్యాండ్&comma; మూడవ దాంట్లో నివాళులు అర్పించే సైనిక దళం వారి వారి ఆయుధాలతో&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు తెలుసా దేశ రక్షణలో పాలుపంచుకొంటున్న సైనికుల కు యుద్దములో పాలుపంచుకోని సైనిక బృందాలు వెనుకనుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాయి&period; అలాంటి బాధ్యతే మా బటాలిన్ నిర్వహించింది&comma; అప్పటికే మా సైనికులు సుమారు ఒక కంపెనీ &lpar;మొదటి బ్యాచ్ &rpar; బటాలిక్ క్షేత్రములో పాకిస్థాను తో యుద్ధములో వ్యస్తులైనారు&comma; సెకండ్ టీం లో నేనున్నాను&period; యుద్ధ క్షేత్రము చేరేవరకు ఎవరి పనులు లేదా బెటాలియన్ ఆదేశించిన పనులు చేయవల్సినదే&excl; యుద్ధ వాతావరణములో సైనికులకు సెలవులుండవు&comma; కొన్ని మినహాయింపులు ఉంటాయి&period; జాట్ రెజిమెంట్ నుండి శెలవకు వచ్చిన కర్తార్ సింగ్ ను వెతుకుతూ సివిల్ పోలీస్ వచ్చింది&period; సిపోయ్ కర్తార్ సింగ్ తన తల్లి మరణించింది అని టెలిగ్రామ్ తెప్పించుకొని ఇంటికి వచ్చాడు&period; ఎంత కార్గిల్ యుద్ధ మైనా ఇలాంటి ఆకస్మిక సంఘటనలకు సెలవు ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90273 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;soldier-1&period;jpg" alt&equals;"what happens if a soldier did not return from his leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెలవు ముగిసాక 15-30 రోజులు కమాండింగ్ ఆఫీసర్ సెలవకు వెళ్ళిన సైనికుల తో సంపర్కానికి అన్ని విధాల కృషి చేస్తారు&comma; ఆఖరి అస్త్రముగా పోలీస్ శాఖకు సమాచారం ఇస్తారు&period; పోలీస్ వారు సైనికుడిని తమ కస్టడీ లో తీసుకొని బటాలిన్ కి సూచన ఇస్తారు&period; మిలిటరీ పోలీస్ కూడా ఈ విషయములో సివిల్ పోలీస్ కి సహకరిస్తుంది&period; ఈ రోజుల్లో ఉద్యోగము దొరకడమే దుర్లభము&comma; ఎవరూ మిలిటరీ వదిలి పారిపోవట్లేదు&period; అదుపులో తీసుకున్న సైనికుడిని విచారణ చేసి తగిన శిక్ష వేసి బటాలిన్ లో చేర్చు కుంటారు&period; ఒకవేళ సైనికుడిదే దోషమని తేలితే మిలిటరీ నుండి కోర్ట్ మార్షల్ చేసి పంపుతారు&period; వీరికి మాజీ సైనికుడి గుర్తింపు&comma; పెన్షన్ కూడా లభించదు&period; ఉద్యోగావశాకాలు లభించవు&period; అసలు విషయానికి వస్తే సిపాయి కర్తార్ సింగ్ తల్లి మరణించిందని సెలవకు వచ్చాడు&comma; కార్గిల్ యుద్దములో తన పటాలం లో ఎక్కువ క్యాజువాలిటీస్ చూసి బెంబేలెత్తి పోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొంగ టెలిగ్రామ్ తెప్పించుకున్నాడు&comma; కమాండింగ్ ఆఫీసర్ మానవతా దృక్పధముతో సెలవు అది కొన్ని రోజులుమాత్రమే ఇచ్చాడు తల్లి కాబట్టి&period; సిపాయి కర్తార్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్ విశ్వాసానికి విఘాతము కలిగించాడు&period; పోలీస్ సిపాయి కర్తార్ సింగ్ ఇంటికి అరెస్ట్ వారంట్ తో చేరింది&comma; కర్తార్ సింగ్ తండ్రి తన కుమారుడు లేడని అబద్ధం చెప్పాడు&period; పోలీస్ వారు ఇల్లంతా పరిశీలనా చేసి సిపాయి కర్తార్ సింగ్ లేడని ద్రువీకరించి నివేదిక బటాలిన్ కు పంపారు&period; యదార్ధానికి సిపాయి కర్తార్ సింగ్ పిడకలు&comma; ఎండు గడ్డి&comma; పశు గ్రాసాలు నిల్వవుండే గోదాములో దాక్కొని పోలీసులనుండి తప్పించుకున్నాడు&period; కానీ విధిని తప్పించుకోలేడుగా&excl; ఆ గోదాములోనే తిష్ట వేసుకొన్న నల్ల మిన్నాగు బలముగా కాటు వేయడముతో నురగలు కక్కుకొంటూ చనిపోయాడు&period; పాపము సిపాయి కర్తార్ సింగ్ కు రావాల్సిన సర్కారీ ప్రయోజనాలు హుళక్కి అయిపోయాయి&comma; యుద్ధ సమయములో దేశాన్ని రక్షించడము మాని తన స్వార్థము చూసుకొన్నాడన్న అపఖ్యాతి ఆ కుటుంబానికి మిగిలింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-90274" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;soldier&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ బెటాలియన్ కూడా సిపాయి కర్తార్ సింగ్ ని మరణించి తరువాత కోర్టమార్షల్ చేసి అతని కి రావలసిన జీతభత్యాలు కుటుంబ సభ్యులకు అందజేసారు&period; అదే బటాలిన్ కు చెందిన సిపాయి దూబే ఉండేవాడు&comma; ఓవర్ వెయిట్ కానీ శారీరక పరీక్షలలో సరయిన ఫలితాలు చూపేవాడు&period; ముగ్గురు పిల్లలు&comma; కమాండింగ్ ఆఫీసర్ దూబే క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని తగిన బటాలియన్ భాద్యతలు అప్పచెప్పేవారు&period; ఈ సిపాయి దూబే కూడా కార్గిల్ యుద్దములో పాలుగొన్నాడు&period; ఆదేశాలను అతిక్రమించి తన ట్రెంచ్ నుండి బయిటకు తన శరీరాన్ని ఎక్సపోజ్ చేయడముతో ఒక స్ప్లింటర్ వలన అయిన గాయముతో తగిన ఫస్ట్ ఎయిడ్ అందే లోగా శరీరము విషపూరితము అయ్యి యుద్ధక్షేత్రములోనే అశువులు బాసాడు&period; సిపాయి దూబే త్యాగానికి గుర్తు గా అదే సమయములో నేలకూలిన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని నేల కూర్చడములో బటాలియన్ ఎయిర్ డిఫెన్స్‌ గన్స్ కి సహకారము అందించినట్లు నివేదిక సమర్పించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫలితముగా షహీద్ దూబే కి వీర్ చక్రము&comma; 50 లక్షల పరిహారముతో పాటూ&comma; మొత్తము ఇన్సూరెన్సు డబ్బు&comma; పిల్లలకు ఉచిత విద్య భార్యకు సర్వీస్ నియమాల ప్రకారము పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా గృహము&comma; భూమి కూడా లభించాయి&period; మూడు నెలల తర్వాత షహీద్ దూబే భార్య పిల్లలూ చూసాను&comma; అప్పటి దాక ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆరోగ్యవంతముగా కనిపించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts