Off Beat

షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోట్స్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చిన్న, చిన్న వస్తువుల కోసం షాపింగ్ మాల్ లకు వెళుతున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వస్తువులు షాపింగ్ మాల్స్ లోనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరతో సంబంధం లేకుండా బ్రాండెడ్ వస్తువులు లభిస్తాయి అనే ఉద్దేశంతో షాపింగ్ మాల్స్ కు వెళతారు. అలాగే వీకెండ్ సమయాల్లో కూడా సిటీలో ఉన్న జనాలు షాపింగ్ మాల్స్ కు వెళతారు. అయితే ఈ షాపింగ్ మాల్స్ లో చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. విదేశీ వంటకాలు కూడా ఆ ఫుడ్ కోర్ట్ లో లభిస్తాయి. అయితే ఈ షాపింగ్ మాల్స్ లోని టాప్ ఫ్లోర్ లోనే ఈ ఫుడ్ కోఆర్ట్స్ ను ఏర్పాటు చేస్తారు. మాల్స్ లో ఫుడ్ కోట్స్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుకున్న కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

#1 ఎక్కువ ప్లేస్ కావాలి కనుక : సాధారణంగా ఆహార పదార్థాలను తినడానికి మరియు వాటిని వండటానికి ఎక్కువ ప్లేస్ కావాలి. అదే పైన అనుకోండి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అలానే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీనికి కారణంగానే పై ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ని పెడతారు. #2 సులువుగా ఆపరేట్ చేయొచ్చు: ఫుడ్ కోర్టుకి ఎక్కువ స్పేస్ మరియు వెంటిలేషన్ కావాలి. అయితే ఎటువంటి డిస్ కంఫర్ట్ కలగకుండా కస్టమర్స్ కి కలగకుండా ఉండాలన్న, సులభంగా కూర్చుని తినాలన్న టాప్ ఫ్లోర్ సౌకర్యంగా ఉంటుంది. #3 మిగిలినవి మళ్ళీ చూడాలని అనుకోరు: ఒకవేళ కనుక గ్రౌండ్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ని పెట్టారంటే అక్కడికి వచ్చి తినేసి వెళ్లిపోతుంటారు. తిన్నాక షాపింగ్ చేయాలని అనిపించదు. ఈ కారణంగా షాపింగ్ చేయరు అందుకనే గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టరు.

why food courts in shopping malls are top

#4 కొనుగోలు చేయరు.. ఒకవేళ కనుక మాల్ లో ఫుడ్ కోర్టు పైన ఉంటే అప్పుడు కింద నుండి పైకి వెళ్తూ ఏమైనా షాపింగ్ చేస్తారు. బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం అందుకనే పైన పెడతారు. దీంతో కింద నుంచి పైకి వెళుతూ ఏదైనా కొనాలని రాకపోయినా నచ్చిన వాటిని కొనేస్తూ ఉంటారు.

Admin

Recent Posts