Off Beat

Rooster : సూర్యుడు ఉద‌యించ‌బోయే విష‌యం కోళ్ల‌కు ముందే ఎలా తెలుస్తుంది.. అవి ఎందుక‌ని ముందే కూస్తాయి..?

Rooster : సాధారణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేచే స‌మ‌యాలు వేర్వేరుగా ఉంటాయి. రాత్రిళ్లు ఎక్కువ‌గా మేల్కొని ఉండేవారు ఉద‌యం స‌హ‌జంగానే ఆల‌స్యంగా నిద్ర‌లేస్తారు. ఇక రాత్రి త్వ‌ర‌గా ప‌డుకునేవారు ఉద‌యాన్నే తెల్ల‌వారుజామునే నిద్ర లేస్తుంటారు. వీరిలో కొంద‌రు సూర్యోద‌యం క‌న్నా ముందే నిద్ర లేస్తారు. అయితే ఇక్క‌డే మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే.. కొంద‌రు కోడికూత‌తో ఉద‌యాన్నే మేల్కొంటారు. అవును.. ఇప్పుడంటే సిటీ క‌ల్చ‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి కోళ్లు ఉండ‌డం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ కోడి కూత‌తో నిద్ర లేచే వారు చాలా మందే ఉన్నారు. అయితే మ‌నిషి క‌న్నా ముందే కోళ్లు ఎలా నిద్ర‌లేవ‌గ‌లుగుతాయి..? వాటికి సూర్యుడు ఉద‌యించ‌బోతున్నాడ‌న్న విష‌యం ఎలా తెలుస్తుంది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా మ‌నం రాత్రి ఆల‌స్యంగా ప‌డుకుంటాం. కానీ ప‌శువులు, ఇత‌ర జంతువులు, ప‌క్షులు చీక‌టి ప‌డ‌గానే నిద్రిస్తాయి. క‌నుక అవి ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర లేస్తాయి. ఇక ముఖ్యంగా కోళ్ల జీవ గ‌డియారం.. అంటే బ‌యోక్లాక్ మ‌న‌క‌న్నా కాస్త ముందే ఉంటుంద‌ట‌. అది వాటికి మ‌న‌క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంద‌ట‌. క‌నుక సూర్యుడు ఉద‌యించే విష‌యాన్ని అవి సుమారుగా 45 నిమిషాల ముందే ప‌సిగ‌డ‌తాయ‌ట‌. అందువ‌ల్ల సూర్యుడు ఉద‌యించే విష‌యాన్ని అవి గుర్తించి అందుకు అనుగుణంగా కూస్తాయి. దీంతో వాటి కూత విన్న మ‌న‌కు స‌హ‌జంగానే మెళ‌కువ వ‌స్తుంది.

why rooster crows before sunrise

కోళ్ల బయో క్లాక్ వేగంగా ప‌నిచేయ‌డంతోపాటు మ‌న‌క‌న్నా వెలుతురును గుర్తించే శ‌క్తి కోళ్ల‌కు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే అవి సూర్యుడు ఉద‌యించ‌డానిక‌న్నా ముందుగానే కూయ‌గ‌లుగుతున్నాయి. వెలుతురును చూస్తే వాటికి ఉత్సాహం వ‌స్తుంది. అందుక‌నే దాన్ని అవి క‌నిపెట్టి కూయ‌డం మొద‌లుపెడతాయి. సూర్యోద‌యానిక‌న్నా ముందే ఇది జ‌రుగుతుంది. దీంతో కోడికూత‌తో చాలా మంది మేల్కొంటారు. త‌రువాత సూర్యుడు ఉద‌యిస్తాడు. దీనివ‌ల్ల అంద‌రూ ప‌నులు చేసుకోవ‌డం మొద‌లు పెడ‌తారు. ఏది ఏమైనా.. ఇది మాత్రం ఒక వింతే క‌దా..!

Admin

Recent Posts