Off Beat

మూడు పూటలా తిన్నది నీట్‌గా అరిగి ఉదయాన్నే ఒక్క సారిగా కంప్లీట్ మోషన్ అవ్వాలి అంటే ఏమి చేయాలి ?

చిన్నతంలో విన్న ఒక శ్రీ కృష్ణ‌ దేవరాయలు మరియి తెనాలిరాముడు కధ ఒక్కటి గుర్తుకు తెచ్చారు. పూర్తిగా కాకపోయినా క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. రాయల వారు ఒకానొక సమయంలో తెనాలి రాముణ్ణి అడిగారట. రోజులో అన్నిటికంటే సుఖమైన సమయం ఏంటి అంటే.. తెనాలి సుఖమయ విరోచనం పూర్తి అయిన మరు క్షణం ప్రభూ.. అనగానే రాయలవారికి కట్టలు తెచ్చుకొన్నంత ఆగ్రహం వచ్చింది..

తెనాలి శిరస్సు తెగిపడుతుంది అని సభలో సభ్యులందరూ అనుకున్నారు కానీ తెనాలి ని విషయం నిరూపించుకోవడానికి కొన్ని రోజుల గడువు ఇస్తే అయన రాయలవారికి విషయం అర్ధం అయ్యేటట్లు పరిస్థితులు కల్పించి మరీ ఒప్పించాడు. బహుశా ఈ కధ వినాల్సిన అవసరం లేదేమో మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు అంటే.

why tenali rama said like that

సుఖమయ విరోచనం అన్నది సమస్య అయితే బహుశా ఒక ముఖ్య కారణం మీరు తీసుకున్న ఆహారం లో పీచు పదార్ధాల లోపం (Less dietary fibre) అన్నది ఒక ముఖ్య కారణం అయ్యే అవకాశాలు ఎక్కువ. దీన్ని క్రమక్రమంగా మెరుగు పరచుకుంటే మీ స్థితి గతుల్లో తేడా మీరే గమనించగలుగుతారు. రోజూ ఉద‌యం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగినా కూడా సుఖ విరేచ‌నం అవుతుంది. లేదా ముందు రోజు రాత్రి కొబ్బ‌రినూనెను ఒక టీస్పూన్ మోతాదులో సేవించాలి.

Admin

Recent Posts