Off Beat

కాలికి వేసుకున్న షూ ను చూసి…వయస్సు చెప్పేయొచ్చు! ఎలాగో తెలుసా?

మీ వ‌య‌స్సెంత‌..? ఫ‌ర్లేదు, మొహ‌మాట ప‌డ‌కండి. ఇదేం ఇంట‌ర్వ్యూ కాదు. మీ వ‌య‌స్సెంతో నిర్భ‌యంగా చెప్పేయ‌వ‌చ్చు. ఏంటి… చెప్ప‌రా..? అయితే చెప్ప‌కండి, మీ వ‌య‌స్సు ఎంతో మీరు చెప్ప‌కుండానే మేం చెబుతాం. అది ఎలా అంటారా..? కేవ‌లం మీ షూ సైజ్ చెప్తే చాలు. దాంతో మీ వ‌య‌స్సెంతో ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు. అది ఎలా అంటారా..? అయితే ఆ ట్రిక్‌ను మీరే తెలుసుకోండి..!

ముందుగా మీ షూ సైజ్‌ను మ‌న‌స్సులో అనుకోండి. దాన్ని 5 అంకెతో గుణించండి. ఆ త‌రువాత వ‌చ్చే సంఖ్య‌కు 50 క‌ల‌పండి. దాన్ని మ‌ళ్లీ 20 తో గుణించండి. ఇప్పుడు వ‌చ్చే సంఖ్య‌కు 1016 క‌ల‌పండి. అనంత‌రం వ‌చ్చే సంఖ్య నుంచి మీరు పుట్టిన సంవ‌త్స‌రాన్ని తీసేయండి. చివ‌రిగా ఓ సారి జ‌వాబు చెక్ చేసుకోండి. వ‌చ్చిన అంకెల్లో మొద‌టి అంకె(లు) మీ షూ సైజ్‌ను చెబుతుంది. చివ‌రి అంకెలు మీ వ‌య‌స్సును తెలియ‌జేస్తాయి. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ..! కింద వివ‌రంగా మ‌రోసారి దాన్ని చూద్దాం.

you can tell your age with your shoe size know how

మీ షూ సైజ్ 8 అనుకుందాం. దాన్ని 5 అంకెతో గుణిస్తే వచ్చేది 8 x 5 = 40. దానికి 50 క‌ల‌ప‌గా 40 + 50 = 90. దీన్ని 20తో గుణించ‌గా 20 x 90 = 1800. దీనికి 1016 క‌ల‌పగా 1800 + 1016 = 2816. దీంట్లో నుంచి మీ పుట్టిన సంవ‌త్స‌రం (ఉదాహ‌ర‌ణ‌కు 1984 అనుకుంటే) తీసేస్తే 2816 – 1984 = 832. వ‌చ్చిన అంకెల్లో మొద‌టిది మీ షూ సైజ్ (8). చివ‌రి రెండు అంకెలు మీ వ‌య‌స్సు (32).

భ‌లేగా ఉంది క‌దూ..! ఇంకెందుకాల‌స్యం, ఈ ట్రిక్‌తో మీకు తెలిసిన వారిని షాక్‌కు గురి చేయండి మ‌రి..!

Admin

Recent Posts