Linga Donda : పొలాల గట్ల మీద, చేనుకు వేసే కంచెల మీద అల్లుకుని ఉండే తీగలల్లో లింగ దొండకాయ తీగ కూడా ఒకటి. వీటిని శివలింగిని కాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజలు శివ లింగం ఆకారంలో ఉంటాయి కనుక వీటిని శివలింగాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి బహుపుత్రి అనే పేరు కూడా ఉంది. పూర్వీకులు లింగ దొండకాయలను తింటే చనిపోతారు అనే చెప్పేవారు. కానీ అది అంతా అపోహ మాత్రమేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కాయల్లో ఉండే గింజలలో అధ్బుతమైన ఔషధ గుణాలు ఉంటాయని వారు తెలియజేస్తున్నారు.
సరిగ్గా ఉపయోగించాలే కానీ లింగ దొండ వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. స్త్రీలలో వచ్చే అన్ని రకాల సంతాన లేమి సమస్యలను తగ్గించడంలో లింగ దొండకాయలు ఎంతో సహాయపడతాయి. స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంతోపాటు, నెలసరి సరిగ్గా వచ్చేలా చేయడంలో కూడా ఈ తీగ ఉపయోగపడుతుంది. స్త్రీలలోని లైంగిక అవయావాలను ఉత్తేజపరిచి, లైంగిక వాంఛను పెంచే శక్తి కూడా లింగ దొండకాయలకు ఉంటుంది.
లింగ దొండ కాయ విత్తనాలను పుత్ర జీవక్ విత్తనాలతో కలిపి తీసుకుంటే అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తీగ వేర్లు, ఆకుల రసం కారంగా ఉంటుంది. ఈ తీగ ఆకుల రసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో వేడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లింగ దొండ కాయ విత్తనాల చూర్ణం మనకు ఆయుర్వేద దుకాణాలలో లభిస్తుంది. దీనిని సరైన మోతాదులో వాడడం వల్ల గర్భాశయ దోషాలన్నీ తొలగి సంతానాన్ని పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు.