Ummetha : ప్రకృతిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలతోపాటు విషపూరితమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఆ విషపూరితమైన మొక్కలలో ఉమ్మెత చెట్టు కూడా ఒకటి. ఉమ్మెత చెట్టు ఆకులు వెడల్పుగా, పూలు తెల్లగా, కాయలు గుండ్రంగా ముల్లులను కలిగి ఉంటాయి. ఈ మొక్కలో ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే విషపూరితమైనవి కూడా. ఎంతో అనుభవజ్ఞులు అయిన ఆయుర్వేద నిపుణులు మాత్రమే ఈ మొక్కను ఉపయోగించి అనారోగ్య సమస్యలను తగ్గిస్తారు. ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు.
మనిషిని పిచ్చి వాడిగా చేసే శక్తి కూడా ఉమ్మెత్తకు ఉంది. శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో ఉమ్మెత్త చెట్టు ఎంతో సహాయపడుతుంది. ఉమ్మెత్త ఆకులకు ఆముదాన్ని రాసి వెచ్చగా చేసి కట్టడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మంపై వచ్చే దద్దుర్లను, దురదలను తగ్గించడంలో కూడా ఉమ్మెత్త చెట్టు ఉపయోగపడుతుంది. శ్వాసకోస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా ఉమ్మెత్త సహాయపడుతుంది. తెల్ల ఉమ్మెత్త చెట్టు కంటే నల్ల ఉమ్మెత్త చెట్టు శ్రేష్టమైనదని నిపుణులు చెబుతున్నారు.
వాతాన్ని, మూర్ఛను, పిచ్చిని, విపరీతమైన తలనొప్పిని, కఫాన్ని, కుష్టు వ్యాధిని నివారించే గుణం ఉమ్మెత్త చెట్టుకు ఉంది. ఈ చెట్టు ఆకులను కానీ కాండాన్ని కానీ నీడకు ఎండబెట్టి వాటిని మండించడం ద్వారా వచ్చే పొగను మూడు రోజుల పాటు ఉదయం లేదా సాయంత్రం పూట పీల్చడం వల్ల విపరీతమైన దగ్గు, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ చెట్టు ఆకులను మెత్తగా చేసి ఆవు పేడ లేదా గేదే పేడలో ఉడికించి ఆ మిశ్రమాన్ని కట్టుగా కట్టడం వల్ల మాములు గడ్డలు, వేడి గడ్డలు పగిలి వాటిలో ఉండే చెడు రక్తం అంతా పోయి అవి త్వరగా తగ్గుతాయి. మూల శంక వ్యాధిని తగ్గిండంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఉమ్మెత్త చెట్టు ఔషధ గుణాలు పూర్తిగా తెలిసిన వారు, నిపుణులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ చెట్టును ఉపయోగించి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ చెట్టు విషపూరితమైనది కనుక నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే దీనిని ఉపయోగించాలి.