Balu Rakkasi : గ్రామాలలో, ఖాళీ ప్రదేశాలలో, పంట పొలాల వద్ద ఎక్కువగా కనిపించే ముళ్ల ముక్కలల్లో బలు రక్కసి మొక్క కూడా ఒకటి. దీనిని పిచ్చి కుసుమ, ములు పుచ్చ అని కూడా పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో బ్రహ్మదండి అని పిలుస్తారు. దీనికి స్వర్ణ క్షీరి, స్వర్ణ దుగ్ద, జెర్రిపోతు మొక్క అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఆకులు, కాండం అన్నీ ముళ్లను కలిగి ఉంటాయి. ఈ మొక్క పూలు మాత్రం పసుపు రంగులో చాలా అందంగా కనిపిస్తాయి.
ఈ మొక్కను తుంచిప్పుడు పసుపు రంగులో ఉండే పాలు వస్తాయి. ఈ చెట్టు గింజలు ఆవాల లాగా చిన్నగా, నల్లగా ఉంటాయి. గింజలల్లో 25 నుండి 35 శాతం వరకు పచ్చ రంగులో నూనె ఉంటుంది. దీనిని అర్జిమన్ నూనె అంటారు. ఈ మొక్కలో ప్రతిభాగం విషపూరితమైనదే. కానీ దీనిని ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తారు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణులు మాత్రమే దీనిని ఉపయోగించగలరు. కంటి సమస్యలను, మూర్ఛను, చర్మ సంబంధమైన, మూత్రాశయ సంబంధమైన సమస్యలను ఈ మొక్కను ఉపయోగించి నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
పూర్వ కాలంలో ఈ మొక్కను అనేక అనారోగ్య సమస్యలను, వ్యాధులు తగ్గించేందుకు వాడేవారు. మొండి వ్రణాలు, గడ్డలు ఉన్నవారు.. ఈ మొక్క సమూలాన్ని తెచ్చి శుభ్రం చేసి దంచి ఆ మిశ్రమాన్ని వాటిపై వేసి కట్టు కట్టాలి. దీంతో అవి తగ్గిపోతాయి. అలాగే ఈ మొక్కను తెంచగానే వచ్చే పచ్చని ద్రవాన్ని పైపూతగా రాస్తుంటే.. పులిపుర్లు, వేడి కురుపులు తగ్గుతాయి.
ఈ మొక్కను మొత్తం తెచ్చి శుభ్రం చేసి దాని నుంచి రసం తీయాలి. దానికి ఒకింత ఆవ నూనె కలపాలి. అంటే ఈ మొక్క రసం 2 టీస్పూన్లు అయితే దానికి ఒక టీస్పూన్ ఆవ నూనె కలపాలి అన్నమాట. అలా కలిపిన మిశ్రమాన్ని సన్నని మంటపై మరిగించాలి. దీంతో నీరు పోయి నూనె మిగులుతుంది. దాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను పైపూతగా రాస్తుంటే సోరియాసిస్, ఎగ్జిమా, చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఈ మొక్క ఆకులను తెచ్చి శుభ్రం చేసి నీటిలో మరిగించి ఆ నీళ్లతో తామర, దురద ఉన్న ప్రదేశాల్లో కడుగుతుండాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి. ఇక సంతాన లోపం ఉన్నవారు ఈ మొక్క వేళ్లను తెచ్చి శుభ్రంగా కడగాలి. అనంతరం నీడలో ఎండబెట్టాలి. తరువాత ఆ వేళ్లను పొడి చేయాలి. దీన్ని పటికబెల్లంతో కలిపి ఒక టీస్పూన్ మోతాదులో తినాలి. ఇలా చేస్తుంటే సంతానం లోపం తగ్గుతుంది.
ఈ మొక్కను మొత్తం తెచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. అనంతరం పొడి చేయాలి. దీన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దీనికి 200 ఎంఎల్ నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగించి 50 ఎంఎల్ అయ్యేలా చూసుకోవాలి. దీన్ని వడబోసి రోజుకు 2 సార్లు తీసుకుంటే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. అయితే ఈ మొక్క వల్ల ఎన్ని ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితమైంది. కనుక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే దీన్ని వాడాల్సి ఉంటుంది.