మొక్క‌లు

అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన అత్తపత్తి మొక్క.. దీంతో ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు..!

అత్తపత్తి మొక్క. దీన్నే ఇంగ్లిష్‌లో టచ్‌ మి నాట్‌ ప్లాంట్‌ అని పిలుస్తారు. ఇది మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ చూసినా బాగా పెరుగుతుంది. అత్తపత్తి మొక్క వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దీని వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using touch me not plant

1. అత్తపత్తి మొక్క ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను దంచి మిశ్రమంగా చేసి గాయాలు, పుండ్లపై రాసి కట్టు కడుతుండాలి. దీంతో గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.

2. కొందరు మహిళలకు రుతు సమయంలో రక్తస్రావం అధికంగా జరుగుతుంది. అలాంటి వారు ఈ మొక్క ఆకుల నుంచి రసం తీసి దాన్ని 6 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. దీంతో సమస్య తగ్గుతుంది. లేదా ఈ మొక్క వేర్ల నుంచి రసం తీసి దాన్ని 5 ఎంఎల్‌ చొప్పున ప్రతి 2 గంటలకు ఒకసారి తేనె, మిరియాల పొడితో కలిపి తాగుతుండాలి. దీంతో అధిక రక్తస్రావం తగ్గుతుంది.

3. అత్తపత్తి మొక్క ఆకులను సేకరించి శుభ్రం చేసి వాటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం ఆ ఆకులను పొడి చేసి దాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ పొడిని 1 టీస్పూన్‌ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్‌ పాలలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తుంటే పైల్స్‌ సమస్య తగ్గుతుంది. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

4. అత్తపత్తి మొక్క ఆకులను దంచి మిశ్రమంగా చేసి దాన్ని కీళ్లపై రాసి కట్టుకట్టాలి. రాత్రిపూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే కట్టు తీసేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

5. డయాబెటిస్‌ను తగ్గించడంలో అత్తపత్తి మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఆ ఆకుల నుంచి రసం తీసి దాన్ని 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకుని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. అలాగే రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు తాగాలి. ఇలా 7-10 రోజులు చేస్తే చాలు, ఆశించిన ఫలితం కనిపిస్తుంది.

6. విరేచనాలు అవుతున్న వారు అత్తపత్తి మొక్క ఆకుల రసాన్ని 30 ఎంఎల్‌ మోతాదులో తాగాలి. దీంతో గుణం కనిపిస్తుంది.

7. కామెర్లను తగ్గించడంలోనూ అత్తపత్తి మొక్క ఆకులు పనిచేస్తాయి. ఈ మొక్క ఆకుల నుంచి రసం తీసి దాన్ని రోజుకు రెండు సార్లు 20 ఎంఎల్‌ చొప్పున తాగుతుండాలి. 3 వారాల పాటు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది.

8. అత్తపత్తి మొక్క ఆకులను పేస్ట్‌లా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి సేవించాలి. రోజుకు ఒకసారి ఇలా చేయాలి. 3-4 రోజులు ఇలా తీసుకుంటే కడుపులో ఉండే సూక్ష్మ క్రిములు, పురుగులు నశిస్తాయి. కడుపు నొప్పి తగ్గుతుంది.

9. అత్తపత్తి మొక్క ఆకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే చర్మంపై ఏర్పడే దద్దుర్లు తగ్గుతాయి. దురద తగ్గుతుంది. అలాగే ఈ మొక్క వేర్లను పేస్ట్‌లా చేసి రాస్తున్నా ఆయా సమస్యలు తగ్గుతాయి.

10. అత్తపత్తి మొక్క వేర్లను శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. నోరు శుభ్రంగా మారుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

11. పాము కాటుకు అత్తపత్తి మొక్క వేర్లతో చికిత్స చేయవచ్చు. అత్తపత్తి మొక్క వేర్లను 10 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని 400 ఎంఎల్‌ నీటిలో మరిగించి అనంతరం వచ్చే డికాషన్‌ను తాగాలి. దీంతో విషం హరిస్తుంది. అయితే దీన్ని అత్యవసర పరిస్థితిలోనే వాడాలి. డాక్టర్‌ అందుబాటులో ఉంటే ముందుగా డాక్టర్‌ వద్దకే వెళ్లాలి.

12. అత్తపత్తి మొక్క ఆకుల పేస్ట్‌లో కొద్దిగా అశ్వగంధ పొడి కలిపి రాస్తుంటే జారిపోయిన వక్షోజాలు బిగువుగా మారుతాయి.

13. పురుగులు కుట్టిన చోట ఈ మొక్క ఆకుల పేస్ట్‌ను రాస్తుండాలి. దీంతో సమస్య తగ్గుతుంది.

14. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ మొక్క ఆకులను 5 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని దంచి పేస్ట్‌లా చేయాలి. దాన్ని వేడి నేటిలో వేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. దీంతో ఆ పేస్ట్‌లోని సారం నీటిలోకి చేరుతుంది. తరువాత ఆ నీటిని తాగాలి. రాత్రి పూట ఇలా చేస్తుంటే నిద్ర చక్కగా పడుతుంది.

15. అత్తపత్తి మొక్క ఆకుల రసాన్ని 15 ఎంఎల్‌ మోతాదులో ఉదయం, సాయంత్రం సేవిస్తుంటే ఆస్తమా తగ్గుతుంది. హైబీపీ నుంచి బయట పడవచ్చు.

16. అత్తపత్తి మొక్క ఆకులను పేస్ట్‌లా చేసి దాన్ని తలకు బాగా పట్టించాలి. కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు.

సూచన – ఈ మొక్క వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts