హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

గ‌ర్భం దాల్చ‌డం అనేది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ద‌క్కే వ‌రం. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌న్నిహితులు, తెలిసిన వారు మ‌హిళ‌ల‌కు అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. అది తినాలి, ఇది తిన‌కూడ‌దు.. అని చెబుతుంటారు. అయితే ఆ స‌మ‌యంలో ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు ? అనే విష‌యాన్ని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఆ స‌మయంలో పూర్తిగా మానేస్తేనే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. మరి గ‌ర్భిణీలు మానేయాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

pregnant woman should avoid these foods

1. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను తిన‌రాదు. తింటే వారికి పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్ అంటే ప్యాక్ లో ఉండే ఆహారాల‌ను కొద్దిగా నీళ్లు క‌లిపి లేదా వేడి చేసి లేదా నూనె క‌లిపి వండేవి అన్నమాట‌. అంటే ఆ ఆహారాలు నిమిషాల్లోనే త‌యార‌వుతాయి. అలాంటి ఆహారాల‌ను గ‌ర్భిణీలు అస్స‌లు తిన‌రాదు.

2. సీ ఫుడ్.. అంటే చేప‌లు, రొయ్య‌ల‌ను తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వాటిల్లో పాద‌ర‌సం ఎక్కువ‌గా ఉంటుంది. విష ప‌దార్దాలు ఉంటాయి. అవి హానిని క‌ల‌గ‌జేస్తాయి.

3. ప్రాసెస్ చేయ‌బ‌డిన మాంసాహారం తిన‌రాదు. మాంసాహారం తినాల్సి వ‌స్తే దాన్ని బాడా ఉడ‌క‌బెట్టుకుని తినాలి. కీమా రూపంలో తీసుకుంటే ఇంకా మేలు.

4. ప‌చ్చి కోడిగుడ్ల‌ను అస్స‌లు తీసుకోరాదు. బాగా ఉడికించి హార్డ్ బాయిల్ చేసి తినాలి. ప‌చ్చి గుడ్ల‌లో సాల్మొనెల్లా బాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది హాని క‌ల‌గ‌జేస్తుంది.

5. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు టీ, కాఫీలు తాగే విష‌యంలోనూ జాగ్ర‌త్త వ‌హించాలి. అధికంగా టీ, కాఫీల‌ను తాగరాదు. తాగితే వాటిల్లో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇది శిశువుకు మంచిదికాదు.

6. మొల‌కెత్తిన గింజ‌ల‌ను నేరుగా అలాగే తిన‌రాదు. వాటిని పెనంపై కొద్దిగా నూనెలో లేదా నెయ్యిలో వేయించి తినాలి.

7. పాలు తాగితే బాగా మ‌రిగించి తాగాలి. అలాగే పండ్ల ర‌సాలను చ‌క్కెర లేకుండా ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగాలి. ప్యాకెట్ల‌లో అమ్మే పండ్ల ర‌సాలు తాగ‌రాదు.

8. మ‌ద్యం అస్సలు సేవించ‌రాదు. కూర‌గాయ‌ల‌ను బాగా క‌డిగి వండుకుని తినాలి. జంక్ ఫుడ్ ను మానేయాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts